24.7 C
Hyderabad
March 29, 2024 07: 58 AM
Slider ప్రత్యేకం

పెట్రోల్, వంటగ్యాస్ పై మన రక్తం తాగుతున్న మోడీ, కేసీఆర్

#teenmarmallanna

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ పై  కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మన రక్తం తాగుతున్నారు అంటూ తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్ లో వ్యాఖ్యానించారు.

గతంలో  ఈ అంశాన్ని తెలియజేశాను అంటూ తీన్మార్ మల్లన్న గుర్తు చేశారు. మల్లన్న కు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు.  ఆ నాయకుడు, ఈ నాయకుడు అని కాదు.వాళ్ళు వీళ్లు అని కాదు ఎవరు తప్పు చేస్తే వాల మొఖం మీదనే మల్లన్న మాట్లాడుతాడు.వీటిని కొందరు తట్టుకోలేక  మల్లన్న పై అక్రమ కేసులు పెట్టించి 73రోజులు జైల్లో పెట్టిన అంశం అందరికీ తెలిసిందే. అయిన మల్లన్న ఎక్కడ వెనకడుగు వేయలేదు.

అంతకు అంతా మరింత  రెట్టింపుతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అయితే ఈసారీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మల్లన్న విరుచుకుపడ్డాడు. మోడీ, కెసిఆర్ ఇద్దరూ కలిసి ప్రజలపై మోపిన భారం పై  మల్లన్న గళమెత్తారు. కేంద్ర రాష్ట్ర అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టాడు.

బుదవారం Q న్యూస్ లో మల్లన్న మార్నింగ్ న్యూస్ చదువుతూ ఓ పత్రికలో వచ్చిన  కథనంపై మల్లన్న మాట్లాడారు. ఈ ఏడేళ్ల పాలనలో పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరల పెంపు పై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత పాపం చేసిందో, కేసీఆర్ ప్రభుత్వం కూడా అంతే పాపం చేసిందని  మల్లన్న ఘాటు విమర్శలు చేశారు.

నరేంద్ర మోడీ కేసీఆర్,మిగతా డీలర్స్ ఎవరు ఎంత పనులు వసూలు చేస్తున్నారో గతంలోనే  దేవరకొండ లో పెట్రోల్ బంకు దగ్గర స్పష్టంగా  తెలియజేశానని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ సుద్దపూస కాదు, కెసిఆర్ సుద్దపూస  కాదు. వీరిద్దరు కలిసి మన రక్తాన్ని తాగుతున్నారని మోడీ కెసిఆర్ బాగోతాన్ని మల్లన్న ఎండగట్టాడు.

అవుట రాజశేఖర్, సత్యం న్యూస్ నెట్

Related posts

మెగాస్టార్ ను ఢీ కొట్టబోతున్న చాణక్య

Satyam NEWS

ఇన్స్పెక్షన్: పొద్దుటూరు నారాయణ స్కూల్లో తనిఖీలు

Satyam NEWS

నరసరావుపేటలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment