26.2 C
Hyderabad
December 11, 2024 20: 50 PM
Slider తెలంగాణ ప్రత్యేకం

గ్లోబరీనా..ఓ గ్లోబరీనా.. ఓహో గ్లోబరీనా

BL02_STATES_SECRETARIAT

తెలంగాణలోని అన్ని కంపెనీలు గ్లోబరీనా ను చూసి నేర్చుకోవాలి. ఒక్క తెలంగాణ ఏమిటి దేశంలోని అన్ని కంపెనీలూ గ్లోబరీనా దగ్గర ట్యూషన్ కు రావాలి. వారు అనుసరించే పద్ధతులు అందరూ ఆచరించాలి. వారు ఏం చేస్తుంటారు? కాంట్రాక్టులు ఎలా దక్కించుకుంటారు? అనే పద్ధతులపై విశేషంగా పరిశోధనలు జరపాలి. అందరూ గ్లోబరీనా బాటలో నడిస్తే వారికి ఆర్డర్లకు కొదవ ఉండదు. చేతి నిండా పని, జోలె నిండా సొమ్ములు… గల గల లాడుతుంటాయి. గ్లోబరీనా అనేది చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీ లో చాలా మంది పెద్దల చెయ్యి ఉంది. చెయ్యే కాదు చాలా మంది పెద్దలు పీకలదాకా అందులో మునిగి ఉన్నారని ప్రతీతి. తెలంగాణ లో అధికారంలో ఉన్న పెద్దలకు గ్లోబరీనా నిర్వాహకులు ఎంతో ప్రీతిపాత్రమైన వారు. గ్లోబరీనా అంటే అది తెలంగాణ లో అధికార చిహ్నం. గ్లోబరీనా వారు వస్తున్నాంరంటే ప్రభుత్వ అధికారులు సాహో అనాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మీడియట్ ఫలితాలను విడుదల చేసిన తర్వాత గ్లోబరీనా సంస్థ విశేష ప్రధాన్యతను సంతరించుకుంది. ఇంటర్ రిజల్సు వచ్చినపుడు గ్లోబరీనా సంస్థ అనేది ఒకటి ఉందని చెప్పింది సత్యం న్యూస్. అప్పటి వరకూ ఒక కంపెనీ, ఒక కంపెనీ అని కొన్ని మీడియా సంస్థలు రాసేవి. ఆ ఇంటర్ రిజల్సు తర్వాత 27 మంది ముక్కుపచ్చలారని పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఆ కంపెనీకి ఏం కాలేదు. పైగా రీ వాల్యుయేషన్ కూడా ఆ కంపెనీకే ఇచ్చారు. ఓ పది మందికి మార్కులు అటూ ఇటూ వేసి ఫలితాలను మళ్లీ ఇచ్చేసినా ఎవరూ కిక్కురు మనలేదు. అందరూ ప్రశాంతంగా ఆ ఫలితాలను అంగీకరించేశారు. ప్రభుత్వం కంటితుడుపు చర్యగా విచారణ జరిపించింది అంతే అందరూ ఖుషీ. ఆ తర్వాత గ్లోబరీనా కంపెనీ దశ తిరిగింది. సాక్ష్యాత్తూ గవర్నర్ నర్సింహన్ వైస్ ఛాన్సలర్ గా ఉన్నఆంధ్రప్రదేశ్ లో ఒక యూనివర్సిటీ బ్లాక్ లిస్టులో పెట్టి నానా కష్టాల్లో ఉన్న గ్లోబరీనా తెలంగాణ ఇంటర్ ఫలితాల తర్వాత అద్భుతమైన పేరును సంపాదించుకుంది. పేరుతో బాటు ఆర్డర్లు కూడా వచ్చి పడుతున్నాయి. తెలంగాణలో ధరణి వెబ్ సైట్ ను ఆ కంపెనీయే నిర్వహిస్తుంది. ఇది అత్యంత కీలకమైన వెబ్ సైట్. ఇందులో తెలంగాణలోని ల్యాండ్ హోల్డర్ల అందరి జాతకాలు ఉంటాయి. అవి తారుమారు అయితే అంతే సంగతులు. ఇప్పటికే ఇలాంటి చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. రెవెన్యూ ఉద్యోగులు లంచగొండులు కావడం వల్ల ఇలా జరుగుతున్నదని పాలకులు చెపేశారు. ప్రజలు నమ్మేశారు. ఒక దశలో రెవెన్యూ శాఖను ఎత్తేస్తామన్నారు లేదా పేరు మార్చేస్తామన్నారు దాంతో ఆయా శాఖల ఉద్యోగులు కూడా నోరు మూసేసుకున్నారు. ఇప్పడు గ్లోబరీనాకు మరింత బాధ్యతగల సచివాలయం రికార్డుల తరలింపు బాధ్యత అప్పగించేశారు. అత్యంతకీలకమైన ఫైళ్లను గ్లోబరీనా చేతుల్లో పెట్టేశారు. వారు తరలిస్తున్నారు. పాత రికార్డులన్నీ పోతే ఎంచక్కా కొత్త రికార్డులు రాసుకోవచ్చు…మన ఇష్టం వచ్చినట్లు. అడిగే వారు లేరు. ఒకరిద్దు అడిగినా సమాధానం చెప్పేవారు ఉండరు. ఇప్పుడు ఫైళ్లు అన్నీ గ్లోబరీనా చేతిలోనే ఉన్నాయి కదా సచివాలయం కూలగొట్టే బాధ్యత కూడా దానికే అప్పగించేస్తే బెటర్ అనే ఆలోచన వచ్చిందట. కొత్త సచివాలయం నిర్మాణ బాధ్యతలు షాపూర్జీ పల్లోంజీకి, కూలగొట్టుడు గ్లోబరీనాకు. అసలే పాత సచివాలయం కింద నిధినిక్షేపాలు ఉన్నాయంటున్నారు. అంతా గుంభనంగా జరిగితే అంతకన్నా మేలు ఇంకోటి ఉండదు. అధికారంలో ఉన్నవారికి దగ్గరగా ఉంటే ఎన్ని పనులు జరుగుతాయో గ్లోబరీనా ఉదాహరణ స్పష్టం చేస్తున్నది. అందరూ ఈ సాంప్రదాయాన్నే పాటించాలి.

Related posts

చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

Satyam NEWS

చంద్రబాబు పర్యటనలో పాల్గొన్న జనాన్ని చూసి పిచ్చెక్కిన వైసీసీ నేతలు

Satyam NEWS

కన్ఫర్మ్: అచ్చెన్నాయుడితో బాటు ఆరుగురి అరెస్టు

Satyam NEWS

Leave a Comment