Slider తెలంగాణ

మీడియా ప్రతినిధులకు సౌకర్యాలు

Suraj

సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండడంతో ఈరోజు మీడియా అడ్వైజరీ కమిటీ సమావేశం అసెంబ్లీలోని హాల్ నెం: 4 లో జరిగింది. సమావేశంలో కమిటీ చైర్మన్ సూరజ్ వి. భరద్వాజ్, ఇతర సభ్యులు, సంబంధిత అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులకు కల్పించే సదుపాయాలతో పాటు, పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పెండింగులో వున్న అప్లికేషన్ల పరిశీలన కూడా జరిగింది. కమిటీ సూచించిన జర్నలిస్ట్ లకు పాసుల జారీ ప్రక్రియను కొనసాగించాలని సంబంధిత శాఖకు కమిటీ సూచించింది. ప్రతి సమావేశం సందర్భంగా ఇచ్చే, తాత్కాలిక పాసులు, వాహనాల పాసులను జారీ ప్రక్రియను తక్షణం మొదలు పెట్టాలని నిర్ణయించింది.

Related posts

తెలంగాణ అభివృద్ధి చెందింది కేసీఆర్ వల్లే

Bhavani

సర్వీస్: ముగిసిన ఎన్ఎస్ఎస్ శీతాకాలపు శిబిరం

Satyam NEWS

మంత్రుల పర్యటనలో నిరసన తెలిపితే కేసు

Satyam NEWS

Leave a Comment