హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బిజెపి పాత్ర ఆటలో అరిటిపండు లాంటిదే అనడంలో సందేహం లేదు. తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి వచ్చేస్తాం అంటూ గంభీరంగా ప్రకటనలు ఇచ్చేస్తున్న బిజెపి కి హుజూర్ నగర్ లాంటి దాదాపు 50 నియోజకవర్గాలలో సరైన అభ్యర్ధులే లేరనేది వాస్తవం. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని కాకుండా బయటి వారిని తీసుకువచ్చి పోటీకి నిలబెట్టడం, వారు దారణంగా ఓడిపోవడం, ఓడిపోయిన నాటి నుంచి నియోజకవర్గానికి మెహం కూడా చూపించకపోవడం లాంటివి జరిగాయి. దాంతో బిజెపి ఎన్ని కబుర్లు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మార్పు రావడం లేదు. క్షేత్ర స్థాయిలో మార్పు వచ్చే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర బిజెపి చేపట్టలేదు. ఈ కారణంగా బిజెపికి నియోజకవర్గాలలో పట్టుదొరకడం లేదు. బయటి వారిని తీసుకువచ్చి టిక్కెట్లు ఇచ్చే సాంప్రదాయానికి బిజెపి స్వస్తి పలికితే పరిస్థితిలో మార్పు రావచ్చు. అసెంబ్లీ నియోజకవర్గంలో కష్టపడి పని చేసిన వారికి టిక్కెట్లు ఇస్తామనే భరోసా కల్పిస్తే బిజెపిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ పని చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అయితే అలాంటి భరోసా ఇచ్చేందుకు బిజెపి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ లాగా డబ్బలు తీసుకుని టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి ఉండటం వల్ల బిజెపి వైపు చాలా మంది నాయకులు మొగ్గు చూపలేకపోతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బిజెపి కనీసం డిపాజిట్లు అయినా దక్కించుకోకపోతే వారు చెప్పే కబుర్లకు విలువ లేకుండా పోయే అకాశం కనిపిస్తున్నది. d0 Grid Table 1
previous post
next post