Slider తెలంగాణ

గోల్కొండలో ఆగస్టు 15 ఏర్పాట్లపై సమీక్ష

Chief Secratary

గోల్కొండ కోటలో ఆగస్టు 15 న నిర్వహించే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను  ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు  చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో  స్వాతంత్రదినోత్సవ  ఏర్పాట్ల పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  వివిధ శాఖల అధికారులతో ఉన్నతస్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  పోలీస్, ఆర్ అండ్ బి, జిహెచ్ఎంసి, మెట్రోవాటర్ వర్క్స్, వైద్య, విద్య, హార్టీకల్చర్, ఫైర్, ఆర్కీయాలజీ, సాంస్కృతిక శాఖ ప్రింటింగ్, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ, సమాచార పౌర సంబంధాల శాఖ, టియస్ఎస్ పిడిసియల్, జిఏడి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని, ముఖ్యమంత్రి కేసీ ఆర్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఉదయం  అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం గోల్కొండ కోటలో  జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారని అన్నారు. వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.  స్వాతంత్ర్యదినోత్సవ ఉత్సవాల సందర్భంగా రాజ్ భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్ , గన్ పార్క్, క్లాక్ టవర్ తదితర ముఖ్యప్రాంతాలను విద్యుద్ధీపాలతో అలంకరించాలని, ఆదేశించారు.  ఈ ఉత్సవాల సందర్భంగా తగు బందోబస్తు, పార్కింగ్, ఏర్పాటు చేయాలని నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని, బ్యారికేడింగ్, మంచినీటి సరఫరా,గోల్కొండకు వెళ్ళే మార్గాలలో సైన్ బోర్డులు, పరిసరాల శుభ్రత, మొబైల్ టాయిలెట్స్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ద్వారా ప్రత్యేకంగా మినీ బస్సులు, వేదిక వద్ద పుష్పాలతో అలంకరణ వంటి ఏర్పాట్లు చేయవల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ వేడుకల సందర్భంగా  తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించే విధంగా సాంస్కృతిక కళాకారులతో కళాప్రదర్శనలు  ఉంటాయన్నారు. సమాచార శాఖ ద్వార లైవ్ కవరేజ్, ఎల్ ఈ డి స్కీృన్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తో పాటు తదితర పనులను చేపట్టాలని, సి.యస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, అధర్ సిన్హా, GHMC కమీషనర్ దాన కిషోర్ , డి.జి.పి. మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ , అడిషనల్ డి.జి. జితేందర్ , విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం,  హైదరాబాద్ కలెక్టర్  మానిక్ రాజ్ ,  ప్రొటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ , విద్యా శాఖ కమీషనర్ విజయ కుమార్ , రాజ్ భవన్ లైజన్ ఆఫీసర్ విద్యాసాగర్ , టూరిజం యం.డి. దినకర్ బాబు, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ , TSSPDCL CMD రఘుమా రెడ్డి, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే,  సి.ఐ.ఇ కిషోర్ బాబు  తదితరులు  పాల్గొన్నారు.

Related posts

కొత్తవలసకు వస్తున్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్

Satyam NEWS

ద్వారకా తిరుమల అన్నదానం ట్రస్టుకు భారీ విరాళం

Satyam NEWS

అధ్వాన్న దశలో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ మంత్రిత్వ శాఖ

Satyam NEWS

Leave a Comment