తమిళనాడులోని కాంచీపురంలో గల అత్తి వరద రాజు స్వామి వారిని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్ దేవస్థానానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసీ ఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత , ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి , ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్ కె రోజా , టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి , ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి , టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post