22.2 C
Hyderabad
December 10, 2024 09: 45 AM
Slider తెలంగాణ

బుజ్జగింపులకు రంగంలోకి దిగిన కేసిఆర్

kcr

ఎంతో తర్జన భర్జన తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, కానీ ఇప్పుడు అదే ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి. గత కొన్ని రోజులుగా తమకి మంత్రి పదవి వస్తుందని ఎన్నో ఆశలు ప్రేట్టుకున్న కొందరికి మాత్రం తీవ్రమైన నిరాశ మిగిలిందని చెప్పాలి. దాంతో ఒక్క సారిగా చాలా మంది నాయకులు అసంతృప్తి ని బాహాటంగానే వ్యక్తం చేశారు.

అలా బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన వారిలో నాయిని నరసింహారెడ్డి, జోగురామన్న, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, అరికెపూడి గాంధీ, మైనంపల్లి హనుమంతరావుతో పాటు మరికొందరు నేతలు కూడా తెలంగాణ కాబినెట్ పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత మంది నమ్మిన బంట్లు అనుకున్న నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో టిఆర్ఎస్ పార్టీ మొత్తం ఒక్క సారిగా ఉలిక్కి పడింది. దాంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలో దిగి చాలా మేరకు అసంతృప్తిని చల్లార్చారు.

మంత్రి పదవులు దక్కలేదని నైరాశ్యంలో కూరుకుపోయిన కొందరు నేతలకు తెలంగాణ భవన్ నుండి కొత్త వార్తలు వెళ్తున్నాయని సమాచారం. మరికొద్ది రోజుల్లో వారందరికీ కూడా ఎంతో గౌరవప్రదమైన పదవులు అప్పగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా చెబుతున్నారు. ఈ సారి దీనితోనే సరిపెట్టుకోవాలని కూడా కేసిఆర్ వారికి సూచిస్తున్నారని సమాచారం. ఆర్టీసీ చైర్మన్ పదవి ఆఫర్ చేయగా ఆ పదవి స్వీకరించేందుకు తాము సిద్ధంగా లేమని  నాయిని నరసింహారెడ్డి బహిరంగంగానే వెల్లడించారు. అయితే కేసిఆర్ చేసిన వాఖ్యలు విన్నటువంటి కొందరు అసంత్రుప్తి నేతలు మాత్రం దిగివస్తున్నారు.

కేసిఆర్ మాకు దేవుడు అని మళ్ళీ తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా అవన్నీ కూడా గిట్టని వారు వారిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అవన్నీ నమ్మొద్దని అసంతృప్తి నేతలు ఇప్పుడు చెబుతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ పై అసంతృప్తితో బిజెపిలో చేరుతున్నారని కొందరు ప్రచారం చేశారు. అలా ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతానని చెబుతున్న జూపల్లి కృష్ణారావు తాను కేసీఆర్ కు అత్యంత విధేయుడినని చెబుతున్నారు. ఈ విధంగా టిఆర్ ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా తిరిగి విధేయత ప్రకటిస్తున్నా చాలా మంది మనసుల్లో మాత్రం అసంతృప్తి అదే విధంగా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు.

గుమ్మడి  శ్రీనివాస్

Related posts

పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణ

Satyam NEWS

పవన్ కల్యాణ్ వస్తున్నా పారిశుద్ధ్యం పట్టించుకోరా?

Satyam NEWS

బరిలోకి బాలయ్య.. ముఖ్య నేతలతో కీలక సమావేశం

Bhavani

Leave a Comment