28.2 C
Hyderabad
June 14, 2025 09: 51 AM
Slider తెలంగాణ

పిల్లి మొగ్గలు వేసినా మేం పట్టించుకోం

kcr new

‘‘ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్లుగా చెప్పుకునే వారు ప్రకటిస్తున్నారు. ఉదృతం చేసినా, పిల్లిమొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదు. బెదిరింపులకు భయపడదు. బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. బస్సులను ఆపి, బస్టాండ్లు, బడ్ డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించేది లేదు. గుండాగిరి నడవదు. ఇప్పటి వరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉంది. ఇకపై కఠినంగా వ్యవహరిస్తుంది. బస్ స్టాండ్లు, బస్ డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ డిజిపి మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ‘‘ప్రతీ ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తును పెంచండి. అన్ని చోట్ల సిసి కెమెరాలు పెట్టండి. మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించండి. నిఘా పోలీసులనూ ఉపయోగించండి. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి,కోర్టుకు పంపాలి. ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదు’’ అని డిజిపిని సిఎం ఆదేశించారు

Related posts

విజయనగరం టూటౌన్ పీఎస్ ను పరిశీలించిన ఎస్పీ దీపికా…!

Satyam NEWS

జమీయతుల్ ఉలమా ఏ హింద్ అమన్ నిరసన దీక్ష

Satyam NEWS

రైతుల పాదయాత్ర అనుమతి రద్దుపై విచారణ వాయిదా

mamatha

Leave a Comment

error: Content is protected !!