తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా అవమానించారు. పార్టీని నిలువునా చీల్చి టిఆర్ఎస్ లో కలుపుకోవడం కన్నాఇది ఘోరమైనది. శాసనసభలో కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ చీల్చడంతో ప్రతిపక్షహోదా కోల్పోయింది. ప్రతిపక్ష హోదా కోల్పోవడం తో బాటు చాలా ప్రివిలేజస్ ను కాంగ్రెస్ కోల్పోవాల్సి వచ్చింది. అందులో ముఖ్యమైనది పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి. ఇది పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థలో ఎంతో అవసరమైనది. ముఖ్యమైనది కూడా. పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి ఉంటారు. శాసనసభ పద్దులను సరి చూడడం నుంచి బడ్జెట్ లో చేసే వ్యయం పై కూడా పబ్లిక్ ఎకౌంట్స్ చైర్మన్ నిఘా వేసి ఉంచుతారు. పిఏసి రిపోర్టులను సభలో ఉంచుతారు. వాటిపై చర్చించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం శాసనసభ ఆనవాయితీ. చాలా వరకూ పిఏసి రిపోర్టులను ప్రభుత్వం ఆమోదించి అమలు చేయడం ఉండకపోయినా వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చెప్పే విషయాలతో బాటు ప్రతిపక్షం కూడా నిశితంగా పరిశీలించి చెప్పేందుకు ఈ పదవి ఉపకరిస్తుంది. అలాంటి అతి ముఖ్యమైన పిఏసి చైర్మన్ పదవిని తన మిత్ర పక్షమైన మజ్లీస్ కు ఇచ్చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల చివరి రోజు అయిన నేడు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ని ప్రకటించేశారు. rity50 \
previous post
next post