40.2 C
Hyderabad
April 19, 2024 18: 22 PM
Slider ముఖ్యంశాలు

నిరాశ నిస్పృహ‌ లలో కొట్టుమిట్టాడుతున్న సీఎం కేసీఆర్

#MalluBhattiVikramarka

ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో నిరాశ, నిస్పృహ‌ కొట్టొచ్చిన్నట్లు కనబడుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కే. సురేఖ, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

సీఎల్పీ నాయకులు పర్యటన చేస్తుంటే ముఖ్యమంత్రి బెంబేలు ఎత్తుతున్నారని భట్టి అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా.. ప్రజల్లో ఉండి.. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని చట్ట సభ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత అని భట్టి చెప్పారు. చట్టసభల్లో ముఖ్యమంత్రి చేసే తప్పులను ఎండగట్టడం నా పని అని బట్టి చెప్పారు.  ఏడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు.

నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్

నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో అడుగడుగునా రైతులు దోపిడీకి గురవుతున్నారని భట్టి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నావని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు.

ఢిల్లీ నుంచి నిపుణుల కమిటీని పిలిపించి.. స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చేపట్టిన ప్రాజెక్టులపై విచారణ చేయించేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చుపై వాస్తవాలపై నిగ్గుదేలుద్దాం అని కేసీఆర్ కు మీడియా ముఖంగా భట్టి సవాల్ విసిరారు.

ప్రాణహిత చేవెళ్ల తో రైతుకు అన్యాయం

బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టి దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తే.. దానిని వదిలేసి వంద కిలోమీటర్ల కిందకు తీసుకెళ్లి.. రైతాంగానికి తీరని అన్యాం చేసింది నువ్వు కాదా? అని భట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు.

మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఏడేళ్లుగా కాళేశ్వరం నుంచి ఒక్కఎకరాకైనా నీళ్లు ఇచ్చారా? అని భట్టి ఆగ్రహంతో ప్రశ్నించారు. పారిన నీళ్లన్నీ పైనుంచి వచ్చిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టునుంచి మిడ్ మానేరుకు అక్కడనుంచి కాకతీయ కాలువకు అక్కడనుంచి రైతులకు పారకం వరకూ వచ్చిందన్నారు.

తెలంగాణ అంతా అప్పుల మయం

ముఖ్యమంత్రి కేసీఆర్..  లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి రాష్ట్రం మీద తీరని భారం వేశారని మీడియాకు వివరించారు.

కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిందేమీ లేదని మరోసారి పునరుద్ఘాటించారు. పెన్షన్లు అనేవి.. సహజంగా ప్రతి ప్రభుత్వం ఇచ్చేదని.. మొదట రూ.75 ఉండగా.. తరువాత రూ.200 అయిందని.. పెరుగుతున్న ఖర్చులతో పాటు అది పెరిగిందని భట్టి వివరించారు.

కేసీఆర్ నోరుతెరిస్తే చెప్పేవన్నీ అబద్దాలేనని భట్టి అన్నారు. ఢిల్లీకి వెళ్లి దోస్తానా.. అంటావు.. హైదరాబాద్ వచ్చి కొట్లాట అంటావు… అని కేసీఆర్ పై పంచ్ లు వేశారు భట్టి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి తెచ్చిన మూడు నల్లచట్టాలపై మద్దతు ధర, గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారు.

ఈ నల్ల చట్టలపై హైదరాబాద్ లో యుద్ధం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారం రోజులకూ యూటర్న్ తీసుకుని వాటికి మద్దతు ఇచ్చాడని అన్నారు.

ప్రాజెక్టుల పేరుతో దోచుకున్న కేసీఆర్

ప్రాజెక్టులపై కేసీఆర్ దోచుకున్న సొమ్మును లెక్కలతో సహా కేంద్రం.. ముందుంచుతే.. దెబ్బకు బెంబేలెత్తి.. ఇక్కడకు వచ్చి చట్టాలన్నీ మంచివేనని చెప్పారని విమర్శించారు. మొత్తం తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని భట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు.

నల్ల చట్టాలపై తమ పోరాటం ఆగదని భట్టి మరోసారి మీడియాకు చెప్పారు. రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని బట్టి చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టలన్నింటిపైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత చేపిద్దామని భట్టి సవాల్ విసిరారు. ప్రతిపక్ష నాయకుడిగా నేను, ముఖ్యమంత్రిగా మీరు.. ఇద్దరం ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాద్దామని భట్టి సవాల్ విసిరారు.

ఒక్కరోజు మా పర్యటకే బెంబేలు ఎత్తితే ఎలా కేసీఆర్.. మా పర్యటన చాలా రోజులు కొనసాగుతుందని భట్టి వ్యంగ్యంగా విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడ్డం సరికాదని అన్నారు.  యాత్ర పూర్తయ్యాక.. అన్ని ప్రాజెక్టులపై లెక్కలతో సహా చర్చకు నేను సిద్ధం నువ్వు సిద్ధమా? అని భట్టి కేసీఆర్ కు సవాల్ విసిరారు.

Related posts

మైనాస్వామికి అరుదైన గుర్తింపు

Satyam NEWS

పీకే సరికొత్త వ్యూహంతో ఇద్దరికీ చిక్కులు….

Satyam NEWS

హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ ప్రతి క్రీడాకారుడికి ఆదర్శం

Satyam NEWS

Leave a Comment