23.2 C
Hyderabad
September 27, 2023 20: 48 PM
Slider తెలంగాణ

ప్రధాని మోదీతో తెలంగాణ సిఎం కేసీఆర్ భేటీ

kcr modi

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా సమావేశమై ప్రధానితో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై ప్రధానితో కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. దీనికి కేంద్రం సహకారం అందించాలని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు నిధుల కేటాయింపు, పెండింగ్‌లో ఉన్న విభజన హామీల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీని తెలంగాణ సిఎం కేసీఆర్‌ కోరినట్లు సమాచారం

Related posts

బ్రాహ్మణ సంఘం క్యాలండర్ ఆవిష్కరణ

Satyam NEWS

బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో చండీహోమం

Satyam NEWS

ములాయం సింగ్ యాదవ్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!