26.2 C
Hyderabad
December 11, 2024 19: 04 PM
Slider తెలంగాణ

అవినీతి లేని రెవెన్యూ పాలనకు చర్యలు

kcr sec

అవినీతి రహిత రెవెన్యూ పాలన కోసం నిర్దేశించిన కొత్త చట్టం రూపకల్పనపై జిల్లా కలెక్టర్ల అభిప్రాయాన్నిసేకరించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఇందుకోసంముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు . ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులను కూడా ఆహ్వానించారు. కొత్త రెవిన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో భూపరిపాలనతో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు . అవినీతికి ఆస్కారం లేని, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో చట్టం ఉండాలంటే ఎలాంటి నిబంధనలు రూపొందించాలనే అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో తమ అనుభవంలో ఉన్న విషయాలను, కొత్త చట్టం రూపకల్పనలో సూచనలను కలెక్టర్లందరి నుండి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం కలెక్టర్లు కూడా అభిప్రాయాలు, సూచనలు చెప్పడానికి, చర్చలో భాగస్వామ్యం కావడానికి సిద్దమై రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలు పై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. పల్లెలు, పట్టణాలలో  అమలు చేయబోయే 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చిస్తారు. మూడు విషయాలపై లోతైన చర్చ జరగాల్సి ఉన్నందున సమావేశం రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.

Related posts

భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆలయం

Satyam NEWS

ప్రభుత్వ ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ

Satyam NEWS

గోదావరిలో మళ్లీ విహార యాత్ర: పేరంటాలపల్లి బోట్లకు గ్రీన్ సిగ్నల్

Satyam NEWS

Leave a Comment