26.2 C
Hyderabad
December 11, 2024 18: 02 PM
Slider తెలంగాణ

వాస్తవిక దృక్పధంతో తెలంగాణ బడ్జెట్

maxresdefault

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 2019-2020 సంవత్సరానికి రూ.1,46,492.3 కోట్లతో ఆయన బడ్జెట్ ను ప్రతిపాదించారు. బడ్జెట్లో రెవెన్యూ వ్యయం : 1,11,055.84 కోట్లు గా ఉంది. మూలధన వ్యయం : 17, 274.67 కోట్లు కాగా మిగులు : 2,044.08 కోట్లుగా ఉంది. మొత్తానికి ఆర్థిక లోటు : 24,081 కోట్లుగా ఉంటుంది. లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వాస్తవిక దృక్పధంతో బడ్జెట్ రూపొందించామని సిఎం కేసీఆర్ తెలిపారు. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక మాంద్యం ప్రభావం తెలంగాణ పై కూడా తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. బడ్జెట్ హైలైట్స్:

2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు

మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు

బడ్జెట్‌ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు

రాష్ట్ర ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు

ఆరోగ్య శ్రీ కోసం ఏడాదికి రూ. 1,336 కోట్లు కేటాయింపు

ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల 34వేల కుటుంబాలకు ప్రయోజనం

43 రెవెన్యూ డివిజన్లను 69కి పెంచుకున్నాం

459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నాం

గతంలో 68 మున్సిపాలిటీలు ఉంటే వాటి సంఖ్య 142కు పెంచుకున్నాం

కొత్తగా ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకొని.. 13కి పెంచుకున్నాం

రెవెన్యూ డివిజన్లలో 28 డీఎల్పీవోల సంఖ్యను 68కి పెంచాం

రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు మరింత పటిష్టమైన చర్యలు

శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాం

కొత్తగా ఏడు పోలీసు కమిషనరెట్లను ఏర్పాటుచేసి.. వాటి సంఖ్యను 9కి పెంచాం

పోలీసు సబ్‌ డివిజన్ల సంఖ్యను 163కి పెంచాం

పోలీసు సర్కిళ్ల సంఖ్యను 668 నుంచి  717కి పెంచాం

పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కి పెంచాం

తెలంగాణలో అవినీతి రహిత పాలన అందిస్తున్నాం

కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తెచ్చాం

అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం

పంచాయతీరాజ్‌ శాఖ బలోపేతానికి ఖాళీలను భర్తీ చేస్తాం

స్థానిక సంస్థలకు నిధుల కొరత రాకుండా కట్టుదిట్టమైన విధానం 

గ్రామపంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్రం నుంచి నిధులు ఇస్తున్నాం

గ్రామపంచాయతీలకు ప్రతినెలా రూ. 339 కోట్లు అందించాలని నిర్ణయం

రైతుబంధు, రైతుబీమా పథకాలు నిరంతరం కొనసాగుతాయి

పంట రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నాం

రైతుబంధు కోసం 12వేల కోట్లు కేటాయింపు

రైతుబీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ.1,137కోట్లు కేటాయింపు

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ కోసం ఇప్పటివరకు రూ. 20,925 కోట్లు ఖర్చు

ఉదయ్‌ పథకం ద్వారా రుణభారం రూ. 9,695 కోట్లు ప్రభుత్వమే భరిస్తుంది

విద్యుత్‌ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,772 కోట్లు ప్రభుత్వమే చెల్లించింది

గ్రామపంచాయతీలకు రూ. 2,714 కోట్లు కేటాయింపు

పురపాలక సంఘాలకు రూ. 1,764 కోట్లు కేటాయింపు

కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ఉన్నతస్థాయి సేవలు

గ్రామాలు, పట్టణాల ప్రగతి కోసం ఈ నెల 6 నుంచి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ

ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 ఓట్లు కేటాయింపు

అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో రూ. 5,37,373 కోట్లు ఖర్చు చేశాం

Related posts

సుష్మా మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

Satyam NEWS

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఐసోలేషన్‌ కోచ్‌లు రెడీ

Satyam NEWS

13న టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల ఉపవాస దీక్ష

Satyam NEWS

Leave a Comment