హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రభావం చూపే అవకాశం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రద్దయింది. భారీ వర్షం కారణంగా సభాస్థలి మొత్తం జలమయం కావడంతో బాటు హెలికాప్టర్ లో వెళ్లేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. ఈ రెండు కారణాలతో కేసీఆర్ సభ రద్దయింది. హూజూర్ నగర్ లో భారీ వర్షం పడడంతో పాటు, మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో పైలట్ల సూచన మేరకు అనుమతి రద్దు చేసినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
previous post