Slider తెలంగాణ ప్రత్యేకం

విలీనం సంగతి దేవుడెరుగు:ఎత్తేసేలా ఉన్నారు

kcr rtc

ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు చట్ట విరుద్ధంగా, బాధ్యతారాహిత్యంగా, అనాలోచితంగా సమ్మెకు వెళ్లినందున ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లోకి రాని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ విధుల్లోకి తీసుకోవద్దని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో ఆర్టీసీ యధావిధిగా నడిచేవిధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆర్టీసీ పై ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సుమారు 5 గంటల పాటు జరిగిన సమీక్షలో ఆర్టీసీ ని కాపాడుకుంటూనే ఆర్టీసీ, అద్దె బస్సులు 50:50 నిష్పత్తిలో ఉండేలా సంస్థను లాభాల బాటలో నడిచేలా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఉన్న మొత్తం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సంఖ్య 1150 లోపే ఉన్నందున డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్ వైజర్లు, మెకానిక్ ల నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, రు. 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ వున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్లో దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారి చేసింది తీవ్రమైన తప్పిదమని ముఖ్యమంత్రి అన్నారు. ఇక వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఆర్టీసీకి సంబంధించి, ఎప్పటికీ క్రమ శిక్షణా రాహిత్యం, బ్లాక్ మెయిల్ విధానం, తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వతంగా వుండకూడదని ప్రభుత్వం భావిస్తున్నదని కూడా ముఖ్యమంత్రి చెప్పారు.

తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 4114 ప్రయివేట్ బస్సులు ఇంకా వున్నాయి. వాటికి స్టేజ్ కారేజ్ గా చేస్తే వాళ్ళు కూడా ఆర్టీసీలోకి వస్తారు. ఈ విషయంలో వాళ్ళతో ఆర్టీసీ, రవాణా అధికారులు చర్చలు జరుపుతున్నారు.

ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్ రావు, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, అడిషనల్ డీజీపీ జితేంద్ర, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాలలో ఆర్టీసీ లేనే లేదు. బీహార్, ఒరిస్సా, జమ్మూ, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో నామ మాత్రంగా వున్నాయి. ఆ విధంగా చూస్తె కర్నాటక తరువాత తెలంగాణలో అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయి. ఇంత మంచిగా ఆర్టీసీని చూసుకుంటుంటే వారు సమ్మెకు దిగడం అవసరమా?” అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

విలీనం గురించి అఖిల పక్ష సమావేశం జరపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఆర్టీసీ విషయంలో మాట్లాడే హక్కులేదు. సీపీఎం అధికారంలో వున్నా, నాడు, పశ్చిమ బెంగాల్ లొ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారా? కేరళలో చేసారా? బీజేపీ ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో వుంది కాని ఎక్కడైనా విలీనం చేసారా? కాంగ్రెస్స్ పార్టీ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలోనైనా చేశాయా? అందుకే వాళ్లకు అడిగే హక్కు లేదు. అఖిల పక్ష సమావేశం డిమాండ్ అసంబద్ధం. తెలంగాణ  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరి కళ్ళూ తెరిపించాలి”. అని అన్నారు సీఎం కేసీఆర్

Related posts

నిరుపేదలకు నిత్యావసరాలు పంచిన టీఆర్ఎస్ నేత

Satyam NEWS

ట్రాజెడీ: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ భార్య మృతి

Satyam NEWS

విద్యార్థులకు పిఎస్ఆర్ ట్రస్టు తరుపున ఆర్థిక సాయం

Bhavani

Leave a Comment