30.2 C
Hyderabad
September 28, 2023 12: 57 PM
Slider తెలంగాణ

నిజామాబాద్ దాహం తక్షణమే తీరుస్తాం

kcr sec

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందించే సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిజాం సాగర్, సింగూరులో నీటి లభ్యత తక్కువగా ఉన్నందు వల్ల, ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది మంచినీరు అందించడానికి ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. సాగునీరు, తాగునీరు, పోడు భూముల సమస్యను ప్రజలతో చర్చించి, శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే నెలలో రెండు రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్ లో పర్యటించనున్నట్లు సిఎం వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఛాంబర్ లో సమావేశమయ్యారు. మంత్రులు వేముల ప్రశాంత రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ గంప గోవర్థన్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, ఎ.జీవన్ రెడ్డి, హనుమంతు షిండే, బియ్యాల గణేష్ గుప్తా, సురేందర్, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, సిఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, నీటి పారుదల శాఖ ఇఎన్సీ మురళీధర్ రావు, ఎస్ఇలు శంకర్, సుధాకర్ రెడ్డి, ఆర్.డబ్ల్యు.ఎస్. ఇఎన్సీ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీని లింక్ చేసినందు వల్ల భవిష్యత్తులో ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఢోకా ఉండదని సిఎం అన్నారు. గుత్ప, అలీసాగర్ ల మాదిరిగానే లిఫ్టులు పెట్టి బాన్సువాడ, ఆర్మూరు, బాల్కొండ నియోజవర్గాలకు సాగునీరు అందివ్వాలని సిఎం చెప్పారు. దీనికోసం తక్షణం సర్వే జరిపి, లిఫ్టులు ఎక్కడ పెట్టి, ఏఏ గ్రామల పరిధిలో ఎన్ని ఎకరాలకు నీరందించవచ్చో తేల్చాలని నీటి పారుదల శాఖ అధికారులను సిఎం ఆదేశించారు. ప్రతీ ఏటా 90 టిఎంసిలకు తక్కువ కాకుండా ఎస్సారెస్పీని నింపాలని ప్రభుత్వం నిర్ణయించినందున, దీని నుంచి ఎంత వీలయితే అంత ఆయకట్టుకు నీరివ్వాలని చెప్పారు.

Related posts

మహాత్మా ఈ తహసీల్దార్ ను మన్నించు….

Satyam NEWS

Bollinger Bands Example

Bhavani

వెనువెంటనే పీఎస్ లను తనిఖీ చేస్తున్న విజయనగరం ఎస్పీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!