40.2 C
Hyderabad
April 24, 2024 16: 44 PM
Slider సంపాదకీయం

KCR U Turn: నూతన వ్యవసాయ చట్టానికి కొత్త ఊతం

#CMKCRNew

రైతుల వ్యవహారాలలో పూర్తిగా జోక్యం చేసుకుని, వారు ఏ పంట వేయాలో కూడా నిర్దేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకస్మికంగా సాగు వ్యవహారాల నుంచి ఎందుకు ఉపసంహరించుకున్నారు?

ఆయన ఎందుకు ఉప సంహరించుకున్నారో తెలియదు కానీ కేంద్ర వ్యవసాయ చట్టంలోని చాలా విషయాలకు అనుగుణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాధమికంగా వెల్లడి అవుతున్నది.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా ఉప సంహరించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టగా దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. అందులో టీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి. కేంద్ర వ్యవసాయ చట్టాలు చెబుతున్నదేమిటి? వ్యవసాయ కార్యకలాపాల నుంచి ప్రభుత్వ ఉప సంహరణ.

7 వేల కోట్ల నష్టంతో బోధపడిన తత్వం

కేసీఆర్ నేడు చేసింది కేంద్ర గత కొద్ది కాలంగా చెబుతున్నదే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పింది. తత్వం బోధపడితే కానీ నిర్ణయం తీసుకోలేరు అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానం, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వానికి 7 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లింది.

ఒక్క సంవత్సరంలో…. అంటే దాని అర్ధం ఏమిటి? పంట కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వంగానీ కేంద్ర ప్రభుత్వంగానీ చేయలేదు. చేసే వీలు లేదు. అందుకే వ్యవసాయ మార్కెట్ కమిటీలను క్రమేపీ ఉపసంహరించుకోవాలని నూతన వ్యవసాయ చట్టం చెబుతున్నది.

కమ్యూనిస్టు పార్టీలు తాము పట్టిన కుందేటికి మూడేకాళ్లు అన్న చందంగా వాదిస్తున్నారు కానీ మన దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఇప్పుడు కేసీఆర్ లాగా ఆలోచించక తప్పని స్థితి. ఇంత కాలం టీఆర్ఎస్ నాయకులు ఒకటి వాదించే వారు.

తాము ఎక్కువ ధరకు సన్న బియ్యం కొనుగోలు చేస్తుంటే కేంద్రం అడ్డు పడుతున్నది అని. మరి ఇప్పుడు ఏమంటారు? కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాబోయే కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి వస్తుందనేది చేదు నిజం.

కమ్యూనిస్టుల కేసీఆర్ పై ధ్వజమెత్తుతాయా?

ప్రధాని నరేంద్ర మోడీ నెత్తీ నోరూ బాదుకుని చెబుతుంటే కమ్యూనిస్టు పార్టీలు ఆయనను రైతుల పాలిట విలన్ లాగా చిత్రీకరించారు. మరి ఇప్పుడు ఇదే కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ ను ఏమంటాయి?

కమ్యూనిస్టులు పాలిస్తున్న ఒకే ఒక రాష్ట్రం కేరళలో మరి వ్యవసాయ మార్కెట్లను లెక్కకు మించి పెంచి చూపిస్తారా? వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చునని కొత్త వ్యవసాయ చట్టం చెబుతుంటే దానిపై కమ్యూనిస్టుల ఇంత కాలం వక్ర భాష్యం చెప్పాయి.

రైతు ఎలా అమ్ముకుంటాడు? ఇది దళారులకే లాభం అని. ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని తాకట్టు పెట్టారని కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పంజాబ్ లో సెల్ టవర్లు కూల్చివేసే వికృత క్రీడకు కూడా తెరతీశారు.

చలిలో అంత మంది రైతులు అన్ని రోజులుగా నిరసన వ్యక్తంచేస్తుంటే కేంద్రానికి కనికరం కూడా లేదని కమ్యూనిస్టులు ఊరూరా ప్రచారం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టం ఎప్పటికైనా అమలు చేయాల్సిన సంస్కరణ. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో సరకు అమ్ముకోవడం రైతు చేయడం లేదు.

తనకు లాభం ఎక్కడ ఎక్కువ వస్తుందో అక్కడికే వెళుతున్నాడు. ప్రయివేటు వ్యాపారులు పంటకు ముందుగానే పెట్టుబడి పెట్టి ఆ తర్వాత పంట కొనుగోలు చేసే విధానం కూడా చాలా ప్రాంతాలలో అమలులో ఉంది. దీన్నే చట్టబద్ధం చేస్తున్నారు.

చాలా కాలంగా ప్రయివేటు వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుంటున్న రైతులను ప్రభుత్వం కాపాడగలిగిందా? ఇది కఠోర వాస్తవం. ఇలాంటి వాస్తవాలను వివరించి చెప్పి అందులోని కొన్ని సమస్యలకు పరిష్కారంగా నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చారు.

మార్కెట్ సరళీకరణ విధానాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి బిల్లులే రూపొందించాయి. కొన్ని కారణాంతరాల వల్ల వాటిని అమలు చేయలేకపోయాయి.

ఇప్పుడు తెలంగాణ మోడల్ ( అంటే కొనుగోలు కేంద్రాలను విపరీతంగా పెంచి రైతుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేయడం అనే ప్రయోగం) విఫలం అయినందున దీన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ గుణపాఠంగా తీసుకోవాలి.

నూతన వ్యవసాయ చట్టాలను సమర్థించక పోయినా ఇలా గుడ్డిగా, వితండవాదాలతో వ్యతిరేకించడం మానుకోవాలి.

Related posts

వర్మ నిన్ను వదలా!  నీ సినిమాలేవీ రిలీజ్ కానివ్వ

Satyam NEWS

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించండి

Satyam NEWS

మంత్రాల నెపంతో యువకుడి దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment