27.7 C
Hyderabad
April 26, 2024 04: 01 AM
Slider ప్రత్యేకం

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్‌ భేటీ

#CMKCRwithPM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని మోదీతో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. మోదీకి పది వినతిపత్రాలను అందజేశారు.   తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయాలని కోరారు.

అదే విధంగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాదు-నాగపూరు ఇండస్ట్రియల్ కారిడార్‌ను  అభివృద్ధి చేయాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాలలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయలని కోరారు.ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అదనపు నిధులు ఇవ్వాలన్నారు.

వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు నిధులు మంజురు చేయాలని కోరారు. కరీంనగర్‌లో  ట్రిపుల్ ఐటీకి నిధులు మంజూరు చేయాలని, హైదరాబాద్‌లో ఐఐఎంను ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజురు చేయాలని సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోదీని కోరారు. కాగా, సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో టీఆర్‌ఎస్ భవనానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

Related posts

పొట్టి శ్రీరాములు చిత్ర ప‌ఠానికి పూల‌మాల‌లు వేసిన విజయనగరం ఓఎస్డీ

Satyam NEWS

వరంగల్ అర్బన్ లో దొరికిన 10 కిలోల గంజాయి

Satyam NEWS

క‌మ‌ల‌నాధులు ఒత్తిళ్లే..బ‌దిలీకి కార‌ణ‌మా..?

Satyam NEWS

Leave a Comment