రెండు సార్లు పన్ను విధించే అవకాశం ఉన్న జిఎస్ టి ఆర్ 9, 9 సి ఫారాలను రద్దు చేయాలని తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్ రావును కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ రెండు ఫారాల వల్ల చిన్న వ్యాపారులకు నష్టం జరుగుతున్నదని తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ రంగి, కార్యదర్శి ఆర్ విఠల్ మంత్రికి తెలిపారు. జిఎస్ టి కి సంబంధించిన ఈనెల 20 వ తారీకు న గోవా లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానని ఈసందర్భంగా మంత్రి వారికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం ఉపాధ్యక్షులు కృష్ణ గౌడ్, శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి హుస్సేన్ వలి, కార్యవర్గసభ్యులు కాట్రగడ్డ నరేంద్ర, సుబ్రహ్మణ్యం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
previous post