28.7 C
Hyderabad
April 20, 2024 04: 48 AM
Slider జాతీయం

పేదలకు అందని పథకాలతో గాడి తప్పిన తెలంగాణ ఆర్ధికం

#nirmalaseetaraman

కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచే  విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల దారిద్ర్య రేఖకు దిగువ  ఉన్న  ప్రజలు లబ్దిని పొందలేక పోతున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఎన్.వి.ఎస్. ఎస్. ప్రభాకర్ అన్నారు. గురువారం ఢిల్లీలోని భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి  నిర్మల సీతారామన్ ని  నార్త్ బ్లాక్ కార్యాలయంలో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచే  విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ని వివరించారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాల తెలంగాణలో వాటి అమలు తీరును సమీక్షించవలసిందిగా మంత్రిని కోరారు. పథకాలు అమలు చేయని రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఒక కొత్త చట్టం చేయవలసిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ప్రభాకర్ తీసుకువచ్చారు.

అనేక మంది నిరుపేదలు, నిరుద్యోగులు, మహిళలు, దారిద్ర్య రేఖకు దిగువ  ఉన్న ప్రజలు లబ్దిని పొందలేక పోతున్నారని ప్రభాకర్ వారి దృష్టికి తీసుకువచ్చారు. కరోనా కష్టకాలంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం వల్ల వందలాది కుటుంబాలు వేలాది కరోనా బాధితులు తీవ్ర మైన ఇబ్బందికి గురి అయ్యారని వారికి వివరించారు. ఆత్మ నిర్బర్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు, కులవృత్తులకు, చేతివృత్తులకు, చిన్నతరహ సూక్ష్మ పరిశ్రమలు పొందవలసిన ప్రయోజనాలను కెసిఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు పొందలేకపోయారన్నారు.

గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి విద్య, వైద్యం వివిధ పథకాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం అందించవలసిన వాటా కేటాయింపులో తీవ్రమైన జాప్యం వల్ల అభివృద్ధికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈ పాలనలో అప్పుల రాష్ట్రంగా మారిందని మంత్రి దృష్టికి ప్రభాకర్ తీసుకువచ్చారు. పదేపదే ఎఫ్ ఆర్ బిఎంను పెంచమని కోరుతూ ఆర్థికపరమైన క్రమశిక్షణ గాడి తప్పిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని మరిచి కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా నీరుగార్చడానికి ప్రయత్నిస్తోంది. 15 ఫైనాన్స్ కమిషన్ అనేక మార్గదర్శక సూత్రాలను ఏర్పర్చినప్పటికీ స్థానిక ప్రభుత్వాలను అంటే పురపాలక సంఘాలు మండలాలను కార్పొరేషన్లకు నిధులు బదలాయింపు చేయకుండా ప్రభుత్వమే పెత్తనం చెలాయిస్తూ వాటిని నీరుగార్చిందన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని రైల్వేలో అభివృద్ధికి గ్రామీణ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి ఇతర రంగాల కార్యక్రమాలకు పెద్దఎత్తున నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

సుధారాణికి అండగా కదలుతున్న మహిళామణులు

Satyam NEWS

ఈడి రిపోర్ట్ లో కవిత పేరు

Murali Krishna

5 నుండి 9వ తరగతుల విద్యార్థులకు ప్రత్యేక వేసవి శిబిరాలు

Satyam NEWS

Leave a Comment