27.7 C
Hyderabad
April 24, 2024 08: 03 AM
Slider కరీంనగర్

తెలంగాణ తల్లి ప్రత్యేక రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీనే

#adisrinivas

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆకాంక్ష తో సకల జనుల కోరిక మేరకు సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సంతోషకరమైన సందర్భంగానే ఈ రోజు ఆ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు.

ఆనాటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నీళ్లు,నిధులు, నియామకాల సాధన కోసం తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు కేవలం ఒక కుటుంబ ప్రయోజనాలకోసo మాత్రమే ఏర్పడ్డ చందంగా ఉందన్నారు.

తెలంగాణా సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకొని గద్దెనెక్కిన ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మేలు చేసే విదంగా అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తేవాల్సిన  బాధ్యత మరిచి ఉచిత విద్య,వైద్యం, డబుల్ఇల్లు, మూడెకరాల భూమి వంటి సంక్షేమ కార్యక్రమాలు గాలికి వదిలేసి,కారోనా మహమ్మారి కాటుకు ఎంతో మంది రాష్ట్రంలో బలవుతుంటే అంటీముట్టనట్లు వ్యవహరించడం ప్రభుత్వ వైఫల్యం గా భావిస్తున్నామని అన్నారు. పక్క రాష్ట్రాలు కారోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చి ఉచితంగా వైద్యాన్ని అందించి పేద ప్రజల ప్రాణాలను కాపాడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం భదాకం అని అన్నారు.

దేని కోసమైతే ప్రజలు ఆకాంక్షించి ప్రత్యేక తెలంగాణా కావాలని కోరుకున్నారో ఆ దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయడంలేదు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు, దాన్యవాలు తెలియజేయడం జరిగిందన్నారు.

అలాగే రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్,చింతపంటి రామస్వామి,నేతికుంటా జలపతి,గొట్టె ప్రభాకర్, మ్యాకల గణేష్,పులి సత్యం,కనుకరాజు,చంద్రయ్య,అజేయ్, శ్రీనివాస్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

గుజరాత్ పై గురి: ముడు పార్టీలు నువ్వా నేనా

Bhavani

డాక్టర్ సుధాకర్ సంఘటనపై సీబీఐ విచారణ

Satyam NEWS

కమ్మ కమ్మగా రియల్ ఎస్టేట్ కంపెనీ

Satyam NEWS

Leave a Comment