24.7 C
Hyderabad
February 10, 2025 22: 28 PM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

తిరుమల బోర్డులో తెలంగాణకు పెద్దపీట

sudha jupally

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని బుధవారం నాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకూ పాలకమండలిలో 16 మంది సభ్యులు ఉండేవారు కాగా ఆ సంఖ్యను ప్రభుత్వం ఇటీవల 25మందికి పెంచింది. వీరితో పాటు దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, దేవదాయ శాఖ కమిషనర్‌, తుడా చైర్మన్‌.. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉంటారు. కొత్తగా నియమితులైన వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందికీ, తెలంగాణ నుంచి ఏడుగురికీ, తమిళనాడు నుంచి 4గురు, కర్ణాటక నుంచి ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచీ ఒక్కొక్కరికి సభ్యత్వం కల్పించారు. టీటీడీ పాలకమండలిలో పలువురు ఎమ్మెల్యేలకు కూడా స్థానం కల్పించారు. మహిళా కోటాలో కూడా కొందరికి అవకాశం కల్పించడం విశేషం. టీటీడీ పాలకమండలి జాబితా ఇది:1. యు.వి. రమణమూర్తి రాజు (ఎమ్మెల్యే) 2. మేడా మల్లిఖార్జునరెడ్డి (ఎమ్మెల్యే) 3. కొలుసు పార్ధసారధి (ఎమ్మెల్యే) 4. పరిగెల మురళీకృష్ణ 5. కృష్ణమూర్తి వైద్యనాథన్ 6. నారాయణస్వామి శ్రీనివాసన్ 7. జూపల్లి రామేశ్వరావు 8. వి.ప్రశాంతి, 9. బి.పార్ధసారధిరెడ్డి, 10. డాక్టర్ నిశ్చిత ముత్తవరపు, 11. నాదెండ్ల సుబ్బారావు, 12. డీపీ అనంత 13. రాజేశ్ శర్మ, 14. రమేష్ శెట్టి, 15. గుండవరపు వెంకట భాస్కరరావు, 16. మూరంశెట్టీ రాములు, 17.డి.దామోదరావు, 18. చిప్పగిరి ప్రసాద్ కుమార్, 19. ఎం.ఎస్.శివశంకరన్, 20. సంపత్ రవి నారాయణ 21. సుధా నారాయణమూర్తి, 22. కుమారగురు (ఎమ్మెల్యే), 23. పుట్టా ప్రతాప్ రెడ్డి, 24. కె.శివకుమార్, 25. స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఎండోమెంట్స్, 26. దేవాదాయశాఖ కమిషనర్, 27. తుడా ఛైర్మన్, 28. టీటీడీ ఈవో. పాలకమండలిలో సభ్యులుగా అవకాశం వస్తుందని ఆశించిన వారికి రాకపోగా ఊహించని వ్యక్తులకు చోటు దక్కడం గమనార్హం. జాబితా చూసిన ఆశావహులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని తెలుస్తోంది

Related posts

కన్నుల పండువగ యాదాద్రీశుల తిరుకల్యాణం

Satyam NEWS

వలస కార్మికులకు ఆదుకున్న అటవీ శాఖ

Satyam NEWS

నాటి సాయుధ పోరాటంతో లక్షల ఎకరాల భూ పంపిణి

Satyam NEWS

Leave a Comment