37.2 C
Hyderabad
March 28, 2024 19: 16 PM
Slider కరీంనగర్

విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట

#gangula

తెలంగాణ ఉద్యమంలో విశ్వబ్రాహ్మణులు కీలక భూమిక పాత్ర  పోషించారని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నేడు కరీంనగర్ రూరల్ మండలంలో మొగ్దుంపూర్  గ్రామంలో 50 లక్షలతో విశ్వబ్రాహ్మణ వసతి గృహం మిగులు పనుల నిర్మాణానికి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులైన ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారి లు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు కెసిఆర్ జీవం పోశారని అన్నారు. విశ్వ బ్రాహ్మణుల వసతి గృహా నిర్మాణం 2009లోనే పురుడు పోసుకుందని, 25 లక్షల తో పనులు ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ మధుసూదనా చారి నిధుల నుండి 50 లక్షలు కేటాయించారని, బిల్డింగు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని అన్నారు. సమైక్య పాలనలో విశ్వబ్రాహ్మణుల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. విశ్వబ్రాహ్మణుల మీద దాడులు కేసులు నిత్యం వేధింపులు ఉండేవని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విశ్వబ్రాహ్మణులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు.

విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనానికి హైదరాబాద్ నడిబొడ్డులో ఉప్పల్ భగవత్ లో 5 ఎకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి 5 కోట్లు కేటాయించారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవని, తెలంగాణ వచ్చాక ప్రతి నిరుపేదకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో కెసిఆర్ 310 గురుకులాలు ఏర్పాటు చేశారని అన్నారు. గురుకులాలలో అద్భుతమైన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 41 బీసీ కులాలకు హైదరాబాదులోని ఉప్పల్ భగాయత్ కోకాపేట్ లో 82.7 ఎకరాల విలువైన స్థలాన్ని టైం నుంచి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి  పురామల్ల  లలిత -శ్రీనివాస్, తిప్పర్తి  లక్షయ్య, సర్పంచ్  జక్కం నర్సయ్య, ఎంపీటీసీ సభ్యులు పుష్ప అంజిరెడ్డి, కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి,నాయకులు సుంకిశాల సంపత్ రావు, జువాడి రాజేశ్వరరావు కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్ పలువురు విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు.

Related posts

రెచ్చిపోతున్న దొంగలు ఒణికిపోతున్న జనాలు

Satyam NEWS

యూట్యూబ్ లో రాంగ్ గోపాల్ వర్మ ‘మాయ’

Satyam NEWS

రైతుల భూమి ఎక్కడికి పోదు: కామారెడ్డి కలెక్టర్

Satyam NEWS

Leave a Comment