33.2 C
Hyderabad
April 26, 2024 00: 24 AM
Slider వరంగల్

తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం కక్షగట్టడం అన్యాయం

#mogullabhadrayya

చీకటిని ధ్వంసం చేస్తూ అనేక జీవితాలను మేల్కొల్పుతూ తెలంగాణలో అవినీతిపై పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్నను కక్షగట్టి ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ తీరు చాలా బాధాకరమని సామాజిక విశ్లేషకులు మొగుళ్ల భద్రయ్య అన్నారు.

దేశంలో మెజార్టీ జనాభా కలిగిన వెనుకబడిన వర్గాలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా అధికారం వైపు అడుగులేయక పోవడం  బాధాకరని ఆయన అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే రానున్న తరం ఈ తరాన్ని క్షమిస్తుంది.

లేకపోతే అందకారం కల్గిన బానిసత్వం మనం ఎప్పుడూ అనుభవించాల్సిందేనని ఆయన అన్నారు. ఎప్పుడైతే బీజేపీ బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడో అప్పుడే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోడీ, షా లను కలిసి కేంద్ర ప్రభుత్వ పెద్దలే తన వైపు ఉన్నారని చెబుతుంటారని ఆయన అన్నారు.

తెలంగాణ బీజేపీ నేతలవి అసత్య ప్రచారాలని, పిల్లకాకి చేష్టలని అన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నదని ఆయన తెలిపారు.

ప్రశ్నించే గొంతులను కేసుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పటికైనా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు నోరు మెదపకుండా ఉంటే ఈ త్యాగాల తెలంగాణ సమాజానికి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

Related posts

29న ఖమ్మంలో భారీ సభ

Murali Krishna

వనపర్తి జిల్లాలో నేరాల తగ్గుముఖం

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

Satyam NEWS

Leave a Comment