39.2 C
Hyderabad
March 28, 2024 15: 31 PM
Slider నల్గొండ

సాగు,త్రాగునీరు అందించడమే  తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

#saidireddy

తెలంగాణ  ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని రంగాలలో అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

అమరవరం గ్రామంలో రైతు కూలీలతో కలిసి కాసేపు సరదాగా సైదిరెడ్డి వరి నాట్లు వేశారు.శానంపూడి సైదిరెడ్డి వరి పొలాలలో వరాలపై నడుచుకుంటూ కూలీలను ఆప్యాయంగా అక్కా అంటూ సంబోధిస్తూ వరి పొలాలు ఎలా ఉన్నాయంటూ పలకరించారు.అనంతరం సరదాగా కాసేపు రైతు కూలీలతో కలిసి,ముచ్చటించి,వరి నాట్లు వేశారు. శనివారం హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో కృష్ణమ్మ నీటితో తొలకరి నాట్లు వేయడం జరుగతుందని, రైతులు అందరూ పండుగలా వరినాట్లు వేసుకుని సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు. రైతులందరూ పాడిపంటలతో ఆనందోత్సవాలతో ఉండాలని అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రైతాంగానికి అన్నివిధాలుగా అండగా ఉంటు 24 గంటలు కరెంట్,రైతు భీమా,రైతు బంధు,వంటి అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశ పెట్టారని,నాగార్జున సాగర్  నీళ్లు వచ్చిన సంతోషంలో రైతులు సైదిరెడ్డి తో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు,రైతు కూలీలు,ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

రోగ నిర్ధారణకు స్కానింగ్ అవసరం

Bhavani

హన్మకొండ బాలసముద్రం బాలికల హాస్టల్ లో ఉచిత వైద్య శిబిరం

Satyam NEWS

తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన శకపురుషుడు ఎన్.టి.ఆర్.

Satyam NEWS

Leave a Comment