తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన కుటుంబంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాను వీక్షించారు. గవర్నర్ కుటుంబం కోసం ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్రబృందం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. తన సినిమా `సైరా`ను చూడాల్సిందిగా గవర్నర్‌ను శనివారం నాడు చిరంజీవి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్ తన కుటుంబంతో కలిసి మంగళవారం రాత్రి `సైరా`ను వీక్షించారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తనయుడు ప్రముఖ నటుడు రామ్‌చరణ్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించారు. తాజాగా గవర్నర్ ఈ చిత్రాన్ని ప్రశంసించారు.
previous post
next post