తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బంది సౌకర్యార్థం దేశంలోనే మొట్టమొదటి సారిగా మొబైల్ రెస్ట్ రూమ్ వాహనాలను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా తొలివిడతలో 17 వాహనాలను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అన్నారు.భవిష్యత్తులో మరిన్ని వాహనాలను ఏర్పాటు చేస్తామని అయన అన్నారు.