32.2 C
Hyderabad
March 29, 2024 00: 52 AM
Slider తెలంగాణ

ట్రాన్స్ఫర్ :తెలంగాణాలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

telangana govt transfors 60 ias officers

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. జిల్లా కలెక్టర్లతో సహా అన్నిస్థాయిల్లో 39 మందికి స్థాన చలనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జయశంకర్‌ భూపాల జిల్లా కలెక్టర్‌గా అబ్దుల్‌ అజీమ్‌, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శరత్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా  ఎంవీ రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ఏ.శ్రీదేవసేన, నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా హరిచందన దాసరి,

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా శ్వేత మహంతి, నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పాటిల్‌ ప్రశాంత్ జీవన్‌, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పౌసమి బసు, జోగులాంబ గద్వాల్‌ జిల్లా కలెక్టర్‌గా శృతి ఓజా, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌గా వి.వెంకటేశ్వర్లు, వరంగల్‌ అర్భన్‌ జిల్లా కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హన్మంతును,వనపర్తి జిల్లా కలెక్టర్ గా యాస్మిన్ బాషా ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

జగిత్యాల జిల్లా కలెక్టర్ గా జి.రవి , జనగామ జిల్లా కలెక్టర్ గా కె.నిఖిల, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా ఎస్‌.పట్నాయక్‌ ,నిర్మల్‌జిల్లా కలెక్టర్ గా ముషారఫ్‌ అలీ ,ఆసిఫాబాద్ కలెక్టర్‌గా సందీప్‌కుమార్, నిజామాబాద్ కలెక్టర్‌గా ముషారఫ్ అలీ ,ములుగు కలెక్టర్‌గా కృష్ణ ఆదిత్య, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా గౌతమ్, సూర్యాపేట కలెక్టర్‌గా టి.వినయ్‌కృష్ణారెడ్డి , మహబూబ్ నగర్ కలెక్టర్‌గా వెంకట్రావ్ బదిలీ అయ్యారు.

21 జిల్లాల కలెక్టర్లతో పాటు పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పించింది. పలువురు జూనియర్‌ అధికారులకు పోస్టింగ్‌లను ఇచ్చింది. అంతేకాకుండా త్వరలో మరికొంత మంది ఐఏఎస్‌ల అధికారుల బదిలీలను చేపట్టనుంది. చిత్రారామచంద్రన్‌కు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు గృహనిర్మాణశాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. పశుసవంర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదర్‌సిన్హా,

నీటిపారుదల ముఖ్యకార్యదర్శిగా రజత్‌కుమార్‌, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా వికాస్‌రాజ్‌, విపత్తు నిర్వహణ ముఖ్యకార్యదర్శిగా జగదీశ్వర్‌, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా పార్థసారథి, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్‌గా బుర్రా వెంకటేశం, వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్దన్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, ఆర్థికశాఖ కార్యదర్శిగా టీకే శ్రీదేవి, పరిశ్రమల కమిషనర్‌గా

మాణిక్‌రాజ్‌, ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్‌రోస్‌, భూపరిపాలన శాఖ సంచాలకులుగా రజత్‌కుమార్‌ సైనీ, పురపాలక శాఖ కమిషనర్‌గా ఎన్‌.సత్యనారాయణ, మహిళా శిశుసంక్షేమశాఖ కార్యదర్శిగా దివ్య, సీఎస్‌కు ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా అధ్వైత్‌కుమార్‌ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Related posts

శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకమండలి

Satyam NEWS

పాఠశాలలో  కాలనిర్ణయ పట్టిక ప్రకారమే నిర్వహించాలి

Satyam NEWS

రచయిత చిన్నికృష్ణ విడుదల చేసిన డాన్స్ రాజా డాన్స్ ట్రైలర్

Satyam NEWS

Leave a Comment