30.2 C
Hyderabad
September 14, 2024 16: 06 PM
Slider తెలంగాణ

తెలంగాణ జాగృతి ఖతర్ జానపద బతుకమ్మ

telangana jagrithi

తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో తెలంగాణ జానపదాల ఔన్నత్యాన్ని తెలుపుతూ జానపద బతుకమ్మ నిర్వహించారు. ప్రముఖ జానపద కళాకారులు తేలు విజయ, అష్ట గంగాధర్ లు హజరై పాత కొత్త జానపదాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇండియన్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు  AP మణికంఠణ్, ICBF అధ్యక్షుడు బాబు రాజన్, ఎంబసీ అధికారులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఖతర్ లో ప్రముఖ విద్యావేత్త, కె యస్ ప్రసాద్ తో పాటు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురికి మెమెంటోతో సత్కరించారు. తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షులు నందిని అబ్బగౌని మాట్లడుతూ గత సంవత్సరం చేనేత కు చేయుతనిస్తూ చేనేత బతుకమ్మ చేసామని‌, ఈ యేడు మన జానపద ఔన్నత్యాన్ని, కళలను వాటి గొప్పతనాన్ని ప్రపంచానికీ చాటి చెప్పాలనే ఉద్దేశ్యం తో చేసిన జానపద బతుకమ్మ కు విశేష స్పందన వచ్చిందని పెద్ద సంఖ్యలో ప్రవాసులు హజరై లయబద్దంగా, సాంప్రదాయ పరంగా , డీజే చప్పుల్లతో కాకుండా అసలైన బతుకమ్మ పాటలతో, జానపదాలతో బతుకమ్మ ఆడారని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ఖతర్ ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్న మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా కార్మికులకు, ఉద్యోగులకు  నైపుణ్య అభివృద్ధి శిబిరాలు,  మహిళలకు సాంప్రదాయ వంటల పోటీలు, మహిళా సాధికారత సెమినార్లు వంటి సామాజిక కార్యక్రమాలే కాకుండా గల్ఫ్ కార్మికులకు అండ దండగా అనేక కార్యక్రమాలు చేస్తున్నట్టు వివరించారు

Related posts

చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి

Satyam NEWS

పర్యాటక రంగంలో పరుగులు పెడుతున్న తెలంగాణ

Satyam NEWS

కార్డన్ అండ్ సెర్చి: శామీర్ పేట లో కట్టడి ముట్టడి

Satyam NEWS

Leave a Comment