28.7 C
Hyderabad
April 20, 2024 09: 58 AM
Slider ఆదిలాబాద్

నిర్మల్ లో ప్రారంభమైన సాయుధ పోరాట వారోత్సవం

#TelanganaLibearationDay

నిర్మల్ జిల్లాలో 74 వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయుధ పోరాటంలో అమరుడైన నిర్మల్ పట్టణానికి చెందిన రాజ్ గొండ్ విగ్రహం వద్ద, వెయ్యి ఉడాల్ మర్రి చెట్టు అమరవీరుల సంస్మరణ స్థూపం వద్ద సీపీఐ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది.

బస్టాండ్ వద్ద సీపీఐ పార్టీ జండా ఆవిష్కరించారు. అనంతరం జిల్లా సిపిఐ కార్యాలయం లో 74 వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు సభ జరిగింది. దీనికి  ముఖ్య అతిధి గా విచ్చేసిన కామ్రేడ్ కళవేన శంకర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ సిపిఐ మాత్రమే తెలంగాణ సాయుధ పోరాటం ప్రకటించి హైద్రాబాద్ రాష్ట్రాన్ని విముక్తి చేసిందని అన్నారు.

ఈ రోజు బీజేపీ దొంగ నాటకాలు ఆడుతున్నదని అన్నారు. బీజేపీ కి మత కలహాలు తప్ప దేశ ప్రజల సమస్యలు పట్టవని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తూ దేశ ద్రోహానికి పాటు పడుతున్నారని అన్నారు.

విద్యుత్తు బిల్లు 2020 రద్దు చేయాలని, ప్రైవేటీకరణ ఆపాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్.విలాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.యన్. రెడ్డీ, యూపాలి,ముత్యం, జాదవ్ శంకర్, ఏ.సీ.లక్ష్మణ, అబ్దుల్, భీమ్ యేశ్, సాయి, కొం రాయ్, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కార్మిక కర్షక హ్యాపీ డే…

Satyam NEWS

స్వామీ అయ్యప్పా ఈ వివాదాలు నిన్ను ఆపగలవా?

Satyam NEWS

కొల్లాపూర్ నియోజక వర్గ సర్వేలో జూపల్లిదే పైచేయి

Satyam NEWS

Leave a Comment