35.2 C
Hyderabad
April 20, 2024 18: 31 PM
Slider నల్గొండ

విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడంలేదు?

#PrajaporataSamithi

నిరంకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాడి ఐదు వేల మంది వీరులు ఆత్మబలిదానం చేసిన ఏకైక పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని ప్రజా పోరాట సమితి  రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అన్నారు.

గురువారం నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో తెలంగాణ అమర అమరవీరుల చిహ్నానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయుధ పోరాట వీరుల త్యాగాల వల్లనే నిజాం నవాబు భారత ప్రభుత్వంలో తెలంగాణను సెప్టెంబర్ 17 న విలీనం చేశారని, ఇంతటి గొప్ప దినాన్ని కెసిఆర్ ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికైనా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యుక్తులు కావాలని ఆయన అన్నారు. విమోచన దినం అధికారికంగా నిర్వహించనంత కాలం ఈ డిమాండ్ ప్రజల్లో నిరంతరం మారుమ్రోగుతుందని  అన్నారు.

ఈ కార్యక్రమంలో పీఆర్పీఎస్ మండల నాయకులు నాగిల్ల యాదయ్య, గుండాల సత్యనారాయణగౌడ్, కోనేటి యాదయ్య, మేకల బిక్షంగౌడ్, పాల వెంకట్, పోకల అరుణ్ కుమార్, జోగు ప్రవీణ్, దిగశెట్ల శ్రీనివాస్, బానోతు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గణనీయంగా తగ్గనున్న మందుల ధరలు

Satyam NEWS

మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంట్లో దొరికింది ఎంతో తెలుసా?

Satyam NEWS

కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి

Bhavani

Leave a Comment