విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి ఈ విధంగా తెలియచేస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…. జర్నలిస్టు తప్పు రాశాడనుకుంటున్నారా? కాదు నిజమే. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గురువారం విశాఖ వెళ్లారు.. గంగవరం పోర్టులో వియత్నా నుంచి దిగుమతి చేసుకున్న యూరియాను పరిశీలించారు. వెంటనే యూరియా బస్తాలను గంగవరం పోర్టు సీఈవో సాంబశివరావును కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మంత్రి వెంట వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి కూడా ఉన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. యూరియా అందుబాటులో లేదంటూ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ప్రజలు, రైతుల్ని మభ్యపెట్టేందుకే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని.. వాస్తవ పరిస్థితిని వారికి వివరించి తెలియజేసేందుకు విశాఖ పర్యటనకు వచ్చామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
previous post
next post