26.2 C
Hyderabad
February 14, 2025 00: 00 AM
Slider సంపాదకీయం

చంద్రబాబు విజన్‌..తెలంగాణ మంత్రి ఫిదా!

#MLA Sridhar Babu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనలో అనుసరించిన వ్యూహంపై తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడించిన వాస్తవాలు పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి పెట్టుబడులు రాలేదని వైసీపీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వేళ తెలంగాణ మంత్రి శ్రీధర్‌ బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఏడు పదుల వయసు ఐనప్పటికీ ఓ యువకుడిలా చంద్రబాబు కష్టపడుతుంటారని అందరికి తెలిసి విషయమే.

ఈ విషయం ఇటీవలి దావోస్‌ పర్యటనలోనూ అదే విషయం నిజమైంది. ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా తాననుకున్నది సాధించే వరకు ఆయన ముందుకు సాగుతారు. అయితే చంద్రబాబుకు పరిపాలనా దక్షత లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రచారం చేస్తున్నారు. ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన ఆర్ కె రోజా అయితే అదే పనిగా చంద్రబాబుపై లేనిపోని విషయాలు చెబుతూ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడుతూనే ఉంటారు. దానికి భిన్నంగా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పందించడం పలువురిని ఆశ్చర్యపరిచింది.

ఆయన చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో మీడియాతో చిట్‌చాట్ చేసిన శ్రీధర్‌ బాబు..చంద్రబాబు విజన్‌కు సెల్యూట్ కొట్టారు. చంద్రబాబు మంచి ప్లాన్‌తో దావోస్ వచ్చారన్నారు శ్రీధర్‌ బాబు. ఆంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన వనరులు ఉన్నాయని, పొడవైన సముద్ర తీరం ఉండడంతో ఏపీకి పరిశ్రమలు క్యూ కట్టే అవకాశం ఉందన్నారు. ఎంవోయూలు చేసుకున్న వాటిపై ఎందుకు ప్రకటన చేయలేదని లోకేష్‌ను అడిగితే..ఆ వివరాలను ఏపీ వేదికగానే ప్రకటిస్తామని తనతో చెప్పారన్నారు శ్రీధర్ బాబు.

ఈ ప్రకటనతోనే చంద్రబాబు టీం పకడ్బందీ ప్లాన్‌తోనే దావోస్‌కు వచ్చిందన్న విషయం అర్థమైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అల్టిమేట్‌ అంటూ పొగడ్తలు కురిపించారు శ్రీధర్ బాబు. దావోస్‌లో చంద్రబాబు చాలా పెద్దరికంతో వ్యవహరించారని చెప్పుకొచ్చారు శ్రీధర్ బాబు. హైదరాబాద్‌ అభివృద్ధిని డిస్టర్బ్‌ చేయాలనే ఆలోచన చంద్రబాబులో ఏ మాత్రం లేదన్నారు శ్రీధర్ బాబు.

ఇక దావోస్‌లో మైనస్ 8 నుంచి మైనస్ 11 డిగ్రీల చలిలోనూ  చంద్రబాబు స్వెటర్ వేసుకోకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. మేమంతా స్వెటర్లు, జాకెట్లు వేసుకుంటే ఆయన మాత్రం ఇక్కడిలాగే సాధారణ దుస్తుల్లో పెట్టుబడుల వేట కొనసాగించారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు ఈ వయసులోనూ చాలా ఉత్సాహంగా, ఫిట్‌గా ఉన్నారని, యువతరానికి ఆయన ఓ స్ఫూర్తి అంటూ ప్రశంసలు కురిపించారు.

సీ పోర్ట్ ఉండడంతో ఏపీకి చాలా పెద్ద ప్లస్‌ అని, దాన్ని తట్టుకుని తెలంగాణ పెట్టుబడులు సాధించడం టాస్క్ అన్నారు. ఇక ఎవరు అధికారంలో ఉన్న అభివృద్ధి విధానాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. కానీ జగన్‌ అందుకు వ్యతిరేకంగా పని చేశారని గుర్తు చేశారు శ్రీధర్ బాబు.

Related posts

సంచైత నియామకం చట్టరీత్యా వ్యతిరేకం

Sub Editor

విజయసాయి రెడ్డి తోక్‌ కట్‌ చేసిన జగన్‌..?

Satyam NEWS

ఉదయం ఏజన్సీ ఏరియాలో…సాయంత్రం జిల్లా కేంద్రంలో…!ఎవరంటే…?

Satyam NEWS

Leave a Comment