39.2 C
Hyderabad
April 25, 2024 17: 19 PM
Slider వరంగల్

ఎంపీటీసీ స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పుదాం!

Sarpanch President

తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యఅతిథి తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు కుమార్ గౌడ్ హాజరై ములుగు జిల్లా ములుగు మండలం రిటైర్డ్ ఎంప్లాయిస్ భవనంలో ఎంపీటీసీల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా ఎంపీటీసీలు ఎన్నికైనప్పటినుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి నిధులు విధులు అధికారాలు లేక ఎలాంటి అభివృద్ధి చేయలేక గ్రామాలలో ఎదుర్కొంటున్నసమస్యలపైన కూలంకుషంగా చర్చించారు.

గ్రామాలలో అభివృద్ధి నిధుల కింద ప్రతి ఏటా ప్రభుత్వం ద్వారా రూ. 20 లక్షలు నిధులు మంజూరు చేయాలని ప్రతి గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ సభ్యులకు ఒక ఆఫీసు కేటాయించాలని స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన శాసన మండలి సభ్యుల నిధులు మండల పరిషత్ ఎంపీటీసీ సభ్యుల ద్వారా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 243 జి ఓ 11వ షెడ్యూల్ పేర్కొన్న29 అంశాలు ప్రభుత్వాల ద్వారా అమలు జరిగే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరూ కూడా ఐక్యతతో సంఘటితం అయినప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయని అందులో భాగంగా ములుగు జిల్లా ఎంపిటిసిల కార్యవర్గం పూర్తి చేసేందుకు జిల్లా ఎంపిటిసిల సమావేశం ఏర్పాటు చేసేందుకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ రాష్ట్ర ఎంపిటిసిల సంఘం అధ్యక్షులు గడిల కుమార్ గౌడ్ సభ్యులకు నియామక పత్రం అందజేశారు.

నియామకమైన సభ్యులు జిల్లాలోని అన్ని మండల ఎంపిటిసిల ఫోరం కమిటీలను పూర్తి చేసి అతి త్వరలో జిల్లా సమావేశం ప్ర‌క‌టిస్తారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు తంగెడ నాగేష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్ రావు, వరంగల్ రూరల్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, ములుగు జిల్లా మండల ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.

Related posts

‘బ్యాక్ డోర్’ గీతం ఆవిష్కరించిన రాజకీయ సంచలనం వైఎస్ షర్మిల

Satyam NEWS

దళితుల స్వావలంబన కోసమే దళిత బంధు పథకం

Satyam NEWS

రెలిజియనిజం: లక్ష్మణ రేఖ దాటిన అంధ మత విశ్వాసం

Satyam NEWS

Leave a Comment