27.7 C
Hyderabad
June 10, 2023 01: 48 AM
Slider తెలంగాణ

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై ప్రమాణ స్వీకారం

Tamilisai swaring

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌కు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త గవర్నర్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి డిప్యూటి ఛైర్మన్ నేతి విద్యాసాగర్, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్, ఎంపీ సంతోష్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె  జోషీ, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, తమిళనాడు మంత్రులు వేలుమణి, తంగమణి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన తండ్రికి గవర్నర్ తమిళిసై పాదాభివందనం చేశారు. అంతకు ముందు బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై కి రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు.

Related posts

కరోనా వదిలేసి సొంత ప్రతిష్ట కోసం కేసీఆర్

Satyam NEWS

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నీలి మీడియా వక్ర భాష్యం

Satyam NEWS

ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఎన్నిక ఏకగ్రీవం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!