37.2 C
Hyderabad
March 28, 2024 20: 43 PM
Slider నల్గొండ

తల్లులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు

#EtelaRajendar

ఆరోగ్య రంగంలో తెలంగాణా రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఈటెల  రాజేందర్ పేర్కొన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి కారణమని ఆయన కొనియాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 7 కోట్ల అంచనా వ్యయం తో నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్యా కేంద్రాన్ని ఆయన సహచర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తో కలసి ప్రారంభించారు.

రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్,వైద్య ఆరోగ్యశాఖా కమిషనర్ వాకాటి కరుణ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, స్థానిక మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, డి యం హెచ్ ఓ తో పాటు ఆసుపత్రి సూపరెండేంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తల్లులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లలు ఆరోగ్యం గా ఉంటారని అటువంటప్పుడే ఆ సమాజం అభివృద్ధి లోకి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. పూర్తి వసతులతో మాతా శిశు ఆరోగ్యకేంద్రం వారం రోజులలో అందుబాటులో కి రానుందని ఆయన తెలిపారు.

అనంతరం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోటే ఈ భవనం నిర్మాణం జరిగిందని కొనియాడారు. ప్రజల ఆరోగ్యం కాపాడడంలో కార్పొరేట్ ను మించిన వైద్యాన్ని అందించేందుకు కొత్త జిల్లాల్లోనూ మెడికల్ కళాశాలలు స్థాపించారని ఆయన గుర్తుచేశారు.

Related posts

పోలీస్ డైరీ: లాక్ డౌన్ వేళ పోలీసులే పండుగ పెద్దలు

Satyam NEWS

వాహనాన్ని ఢీకొని ఏనుగులు మృతి

Bhavani

పుత్త ఎస్టేట్ లో టీడీపీ కార్యాలయం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment