తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు మౌనం మంచిది కాదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. పదవులు శాశ్వతం కాదని ఆర్టీసీ కార్మికులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అందుకోసం మీరు తక్షణమే ప్రజా క్షేత్రంలోకి రండి అంటూ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. అవసరం అయితే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆయన అన్నారు. నా ఆస్తులపై న్యాయ విచారణకు సిద్ధం. నేను అక్రమ ఆస్తులు సంపాదించినట్లు విచారణలో తేలితే బహిరంగ ఉరిశిక్షకు సిద్ధం అని ఆయన సవాల్ విసిరారు.
previous post