తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో స్వేచ్చలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వర్థామరెడ్డి అన్నారు. ఈ పరిస్థితిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వివరించామని ఆయన అన్నారు. మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ కార్మికులను రెచ్చగొడుతున్నారని అందుకే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దారుణ కాండపై గవర్నర్ కి అన్ని వివరించామని గవర్నర్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు మధ్యవర్తిత్వం వహించి చర్చలకు పిలిస్తే వెళతామని ఆయన అన్నారు. అదే విధంగా ఉద్యోగ సంఘాలతో త్వరలో భేటీ అవుతామని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన సంఘం తమదని తమకు ఏ రాజకీయ నాయకులతో ఒప్పందాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
previous post
next post