30.7 C
Hyderabad
April 24, 2024 00: 41 AM
Slider నిజామాబాద్

కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలి

#telanganarytusangham

పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో నేడు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏ ఐ కె ఎస్) కామారెడ్డి జిల్లా కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఇటీవల అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతు కొనుగోలు కేంద్రాల వద్ద వేసవికాలం దృష్ట్యా మంచినీటి సౌకర్యం టెంట్లు కల్పించాలని కోరారు.

ఇతర సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పైన కపట ప్రేమ చూపిస్తున్నాయని ఆమె అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిటీ అమలు చేయాలని రైతు రుణమాఫీ చేయాలని, ధరణి పోర్టల్ రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

అదేవిధంగా కౌలు రైతులకు కూడా రైతుబంధు వర్తింపజేయాలని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆమె కోరారు. రైతులకు ఏక కాలం రుణమాఫీ లక్ష రూపాయలు చేయాలని నకిలీ విత్తనాలను పురుగుల మందులను అరికట్టాలని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్.దశరథ్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. బాల్రాజ్ కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకులు ఎర్ర నర్సింలు పావు రాజు శ్యామల భీమయ్య దేవన్న కాసిం కిష్టయ్య ఈశ్వర్ దేవరాజ్ సుశీల దేమే నర్సింలు రాజయ్య బాగయ్య యాదయ్య జిల్లా రైతు సంఘ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

లింగాయపల్లి నర్సింలు అనే రైతుపై దాడి చేసిన సర్పంచ్ పై చర్య తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. నర్సింలు రైతు సర్వే నెంబర్ 104/9 సర్వే నెంబర్ 24 గుంటలు హద్దులు పాతడం జరిగిందని అదేవిధంగా నరసింహులు రైతు పైప్ లైన్ ధ్వంసం చేయడం బెదిరించడం జరుగుతుందని ఆమె అన్నారు. లింగాయి పల్లి గ్రామ సర్పంచ్ అపర్ణ భర్త రవి అధికార పార్టీ అండదండలతో మూడెకరాల భూమిని కూడా ఇవ్వాలని రైతులు వేధించడం జరుగుతుందని ఇప్పటికైనా రైతులను వేధిస్తున్న అధికార పార్టీ ఇతర పార్టీ నాయకులు మానుకోవాలని లేనియెడల కలెక్టర్ కార్యాలయం రైతులతో వారి కుటుంబాలతో అమర నిరాహార దీక్ష నిర్వహిస్తామని ఆమె అన్నారు.

 జి. లాలయ్య సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తున్న డాక్టర్ రెడ్డీస్ పై సైబర్ దాడులు

Satyam NEWS

తెలంగాణలో అమలులోకి తెచ్చిన ఎయిరో ప్రాజెక్టులెన్ని?

Satyam NEWS

అంతర్గత కుమ్ములాటలతో సక్రమంగా సాగని ‘కారు’

Satyam NEWS

Leave a Comment