27.7 C
Hyderabad
March 29, 2024 02: 53 AM
Slider హైదరాబాద్

తెలంగాణాలో సెటిలర్స్ చూపు ఎటు?

#GHMCElectionsNew

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆంధ్ర మూలాలు నుండి తెలంగాణాలో లోని అన్ని జిల్లాలో, ముఖ్యం గా హైదరాబాద్, చుట్టూ ప్రక్కల విస్తరించిన నగరు శివారు ప్రాంతాలలో (ఉమ్మడి  రంగారెడ్డి , ఉమ్మడి మెదక్ , ఉమ్మడి నల్గొండ , ఉమ్మడి మెహబూబ్ నగర్) నివసిస్తూ వున్నా లక్షలాది మంది సెటిలర్స్ తెలంగాణ ఉద్యమానికి చిన్న రాష్ట్రాల అభివృద్ధికి అండగా నిలిచారు.

నిజాం సాగర్ నిర్మాణ సమయంలో అనేక మంది గుంటూరు, ప్రకాశం, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల వారు నిజామాబాదు కు వలస వచ్చారు. నీటి వనరులున్న చోటిని వెతుకుంటూ గోదావరి పరివాహక ప్రాంతమైన ఆదిలాబాద్. కృష్ణ పరివాహక ప్రాంతమైన అలంపూర్, గద్వాల్, వ్యవసాయ నిమిత్తం వలస వచ్చారు. గోదావరి పరివాహక ప్రాంతమైన వరంగల్, ఏటూరు నాగారం, ములుగు, భద్రాచలం వలస వచ్చారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఐన తర్వాత, హుజూర్ నగర్, మిర్యాలగూడా పరిసర ప్రాంతాలకు వలస వచ్చారు . పారిశ్రామిక అభివృద్ధి మొదలైన తర్వాత షాద్ నగర్, పటాన్చెరు, కొత్తూరు, జీడిమెట్ల, మౌలాలి, నాచారం, భునగిరి వలస వచ్చారు. చంద్రబాబు నిర్మించిన నూతన నగరం సైబరాబాద్ తో ఆంధ్ర ప్రాంతం లోని ప్రతి కుటుంభం నుండి, ఇద్దరు ముగ్గురు పిల్లలు హైదరాబాద్ కు వలస వచ్చారు. భవన నిర్మాణంతో, రియల్ ఎస్టేట్ పుంజుకోవడం తో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కడప, కర్నూల్, చిత్తూర్ వలస వచ్చారు. సినీ రంగం, ఫార్మా రంగం, వైద్య రంగం, ఆటో మొబైల్ రంగాలతో రాయలసీమ అన్ని చోట్ల నుండి వలస వచ్చారు.

ఇక్కడికి వలస వచ్చిన ప్రతి ఒక్కరు తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించారు. తెలంగాణ భూమి పుత్రులుగా భావించారు. ఈ మట్టిలో పుట్టి, ఈ గాలిలో గాలి పీల్చి, ఇక్కడి నీళ్లను త్రాగి, ఇక్కడి మట్టిలో కలిసిపోయే ఆంధ్ర మూలాలున్న ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, తమకు సంబంధ భాందవ్యాలున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను ఒప్పించారు. తెలంగాణ JAC లో నా లాంటి వాళ్ళు ఎంతో మంది పనిచేసారు. తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు.

ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి

ఆ రోజు మేము మా పార్టీ లతో కలిసి ఉన్నప్పటికీ మా వలస వచ్చిన మా సోదరులు అనేకమంది, తెలంగాణ ఏర్పడిన తర్వాత కడుపులో పెట్టుకుంటాను , కళ్ళలో పెట్టుకుంటాను అన్న KCR మాయ మాటలని నమ్మి తెరాస కు ఓటు వేశారు. విధృహ పూర్వక కొంత మంది మాటలకి భయపడి మద్దతిచ్చారు. తెలుగుదేశం పార్టీ టికెట్ తో గెలిచినా మాగంటి గోపినాథ్, గాంధీ, తెలుగుదేశం పార్టీ లో కీలకం గా ఉండి భూ దందాలు చేసే బండి రమేష్ లాంటి నాయకులూ ఛిన్నా చితక వ్యాపారాలు చేసుకునే మా రియల్ ఎస్టేట్ సోదరులంతా అభద్రతా భావంతో TRS కు జై కొట్టారు. కాంగ్రెస్ లో ఉన్న భాస్కర్ రావు, పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వర రావు వీరంతా కూడా TRS కి జై కొట్టారు. 53  అసెంబ్లీ స్థానాల్లో ప్రధానం గా 16  అసెంబ్లీ స్థానాల్లో పరోక్షం గా సెట్ట్లెర్స్ వున్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే గాజ్వెల్లో ప్రత్తి రైతుగా , ఇటుక బట్టీలు నిర్వహించేవారుగా 20  వేలు పైన వున్నారు. దుబ్బాకలో కూడా 18 వేలు పైన వున్నారు . కరీంనగర్ లాంటి చోట్లకూడా గుంటూరు పల్లెలు 12 పైగా వున్నాయి .

నిజామాబాదు అన్ని నియోజక వర్గాలు వలస దారుల ప్రభావితం, జనాభా ప్రతి పదికన మా సెటిలర్స్ రేషియో ప్రకారం 20  అసెంబ్లీ  స్థానాలు మరియు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.

GHMC ఎన్నికల విషయం:

ఇక GHMC ఎలక్షన్ కొస్తే 150  డివిజన్ లలో  సుమారు 60  డివిజన్లకు పైగా సెటిలర్స్  ప్రభావం ఉంది. 80  లక్షల ఓటర్లలో 30  లక్షల పైగా సెటిలర్స్. ఇక్కడ సెట్ట్లెర్స్ లో ఆంధ్ర మూలాల వాళ్ళు, నార్త్ ఇండియన్స్ , తమిళియన్స్, మరియు దేశం లోని అన్ని రాష్ట్రాల వాళ్ళు వున్నారు. భాగ్య నగరం ఒక కదంబ మాల, కానీ TRS 40 టికెట్స్ కి పైగా సెటిలర్స్ కి ఇవ్వాలి.

150 లో రెండు మూడు మాత్రమే సెటిలర్స్  కి ఇచ్చారు. ఇంత అన్యాయమా ……? సెటిలర్స్ అంటే ఇంత చిన్న చూపా…? ఈ వివక్ష ఎందుకు…?

ఇప్పుడు సెటిలర్స్ అంత ఆలోచిస్తున్నారు, వివక్షకు గురయ్యామని తెలుసుకున్నారు, TRS ని ఓడించాలని లక్ష్యం తో కదులుతున్నారు.

కాట్రగడ్డ ప్రసూన, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు

Related posts

అనంతపురంలో అక్రమ రిజిస్ట్రేషన్ భూ దందా

Satyam NEWS

ఘనంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

13 నుండి కాకినాడలో కంచి కామకోటి పీఠాధిపతి చాతుర్మాస్యదీక్ష

Satyam NEWS

Leave a Comment