37.2 C
Hyderabad
March 29, 2024 18: 10 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

తెలంగాణ స్టార్ట్ అప్ అన్ని రాష్ట్రాలకు అదర్శం

pjimage (5)

తెలంగాణ ప్రభుత్వ పాలసీలకు ఇప్పటికే దేశ, విదేశాల నుంచి ప్రసంశలు లభిస్తున్నాయి. తాజాగా తెలంగాణ  మరో ఘనత సాధించింది. తెలంగాణ ప్రభుత్వ స్టార్ట్ అప్ మాడల్ కు జాతీయస్ధాయిలో ప్రసంశలు లభిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న స్టార్ట్ అప్ మాడల్ ను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరించాలని రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా ఏర్పాటు చేసిన యూకె సిన్హా కమిటీ తన నివేదికలో పెర్కోంది.  సూక్ష్మ మరియు మధ్యతరహా పరిశ్రమల దీర్ఘకాలిక ఆర్థిక, రుణ సంబంధిత సమస్యలు, ఈ రంగం యెక్క వృద్ది తాలుకు సమస్యలకు పరిష్కార మార్గాలను చూపేందుకు మాజీ సెబీ (SEBI) చైర్మన్ యూకె సిన్హ అధ్యక్షతన ఎనిమిది మందితో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీ సిఫార్సులను రానున్న 15 రోజుల్లో అమలు పరుస్తామని కేంద్ర ఎంఎస్ యంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. సూక్ష్మ మరియు మధ్యతరహా పరిశ్రమల దీర్ఘకాలిక అభివృద్ధి కోసం అవసరమైన వ్యూహాంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలో కూడా యూకె సిన్హా కమిటీ సూచించాలని అర్బీఐ కోరింది. సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు దీర్ఘకాలంలో అభివృద్ధి చెందాలంటే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఇందుకోసం వినూత్నమైన పంథాలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొంది.  ఇందులో భాగంగా వివిధ దేశాలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న పద్దతుల పైన విస్తృతంగా ఈ నివేదిక అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న వినూత్నమైన స్టార్టప్ మోడల్ ను పరిశీలించి,  ఇతర రాష్ట్రాలు యధాతథంగా అమలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సూచించింది. తెలంగాణ ప్రభుత్వ పద్దతులు, స్టార్ట్ అప్ నమూనాకు ప్రశంసలు దక్కడం పట్ల రాష్ర్ట ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, గత ఐటి శాఖ మంత్రి కెటి రామారావు మార్గదర్శనంలో రాష్ర్టంలో స్టార్ట అప్ ఈకో సిస్టం అభివృద్దికి వినూత్నమైన పంథాలో ముందుకు వెళ్లామని తెలిపారు. నూతన రాష్ర్టాన్ని ఒక స్టార్ట్ అప్ స్టేట్ గా పరిగణించుకుని, ఐటి, పరిశ్రమల రంగంలో విశిష్టమైన పాలసీలను తీసుకొచ్చామన్నారు. టెక్నాలజీ, స్టార్ట్ అప్స్, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి వివిధ అంశాల సమ్మిళితంగా రాష్ర్ట స్టార్ట్ అప్ ఈకో సిస్టం చాల వినూత్నంగా ఉన్నదన్నారు. తెలంగాణ నమూన ఇతర రాష్ర్టాలకు అదర్శమని కమీటీ తెలపడం సంతోషానిస్తున్నదని తెలిపారు.

Related posts

శ్రీచైతన్య జూనియర్ కాలేజి క్యాంపస్ లో కరోనా

Satyam NEWS

పాఠశాల మధ్యాహ్న భోజనం మెనూ లో స్వల్ప మార్పులు

Satyam NEWS

మహిళను బ్లాక్ మెయిల్ చేసిన వాడికి శిక్ష

Satyam NEWS

Leave a Comment