37.2 C
Hyderabad
March 28, 2024 18: 16 PM
Slider ముఖ్యంశాలు

అసమర్థ నాయకత్వంతో అప్పుల కుప్పగా మారిన తెలంగాణ

#Congress

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ అభివృద్ది అంటే భూములు అమ్మడం కాదని అన్నారు. నిజాం నిరంకుశ పాలనలాగా ఉన్న కేసీఆర్ పాలనకు చరమగీతం పడాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కి ఉప ఎన్నికలు రాగానే దళితులు, బీసీ లు గుర్తుకు వస్తారని, ఓట్ల కోసం సీట్ల కోసం ముఖ్య మంత్రి ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆమె అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయుభ్ ఖాన్, మహిళ అధ్యక్షురాలు కొమురం ధనలక్ష్మి,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగేశ్వర్ రావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, మండల  అధ్యక్షులు చేన్నోజు సూర్యనారాయణ,చి ట మట రఘు, అనుబంధ సంఘాల అధ్యక్షులు వర్కింగ్ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అకస్మాత్తుగా తిరుపతి ప్రచారానికి వస్తున్న సిఎం జగన్

Satyam NEWS

317 జీవో సమస్యల పరిష్కారానికి రాష్ట్రోపాధ్యాయ సంఘం నిరసన

Satyam NEWS

కాప్రా మునిసిపాలిటీలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ

Satyam NEWS

Leave a Comment