24.7 C
Hyderabad
September 23, 2023 02: 31 AM
Slider తెలంగాణ

తెలంగాణ కు దక్కిన అరుదైన గౌరవం

tourism award

ప్రపంచ పర్యాటక దినోత్సవం లో భాగంగా ఈ సంవత్సరం అరుదైన రెండు  జాతీయ అవార్డులను తెలంగాణ పర్యాటక శాఖ గెలుచుకున్నది. గత 4 ఏళ్లు గా తెలంగాణ ప్రభుత్వం వరసగా వివిధ విభాగాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటక పురస్కారాలను అందుకుంటున్నది. తెలంగాణ పర్యాటక శాఖ పర్యాటకులకు పర్యటన ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం కోసం  రూపొందించిన ” ఐ ఎక్స్ ప్లోర్ తెలంగాణ ”  అనే మొబైల్ యాప్ కు, ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం అనే విభాగం లో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి జాతీయ స్థాయి పర్యాటక అవార్డులు ఈ సారి దక్కాయి.” ఐ ఎక్స్ ప్లోర్ తెలంగాణ ”  అనే మొబైల్ యాప్ కు అత్యంత విన్నూత్న ఐటి ఉపయోగం – సోషల్ మీడియా / మొబైల్ అనువర్తనం, వెబ్ సైట్ విభాగంలో  తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన యాప్ కు అందరి ప్రశంసల తో పాటు అరుదైన అవార్డు దక్కింది.భారత దేశంలో ఆధునిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం, మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రి గా, ప్రైవేట్ హెల్త్ కేర్ విప్లవానికి మార్గదర్శకత్వం వహించిన అపోలో ఆసుపత్రికి ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం విభాగాలలో  అవార్డును తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ టూరిజం దినోత్సవం సందర్భంగా ఇండియా టూరిజం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి అవార్డులను తెలంగాణ పర్యాటక శాఖ గెలుచుకుంది. ఇండియా టూరిజం ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి M. వెంకయ్య నాయుడు, UNWTO  సెక్రెటరీ జనరల్ జురాబ్ పొలాలికశవిలి, కేంద్ర  పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ల చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  V. శ్రీనివాస్ గౌడ్ అవార్డు ను స్వీకరించారు

Related posts

ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

ప్రతి ఆదివారం పరిశుభ్రతకు పది నిమిషాలు కేటాయించాలి

Satyam NEWS

పిఎస్ఎల్వీసి 54 విజయంపై  హర్షం

Murali Krishna

Leave a Comment

error: Content is protected !!