32.2 C
Hyderabad
April 20, 2024 19: 51 PM
Slider తెలంగాణ

హే డ్రంకర్స్:తాగి నడిపి రూ.2.25 కోట్లు ఫైన్ కట్టారు

telangana traffic police fined 2.25 crore drunkers

తాగడానికి ఆబ్కారీ శాఖ కు తాగిన తరువాత హోమ్ శాఖకు భారీగా జరిమానాలు చెల్లిస్తున్నారు మందుబాబులు.రోడ్డు భద్రతలో భాగంగా ట్రాఫిక్‌ పోలీసులు మందుబాబులపై చర్యలు కఠినతరం చేస్తున్నారు. తెలంగాణా లో జనవరిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ 2,254 మంది పోలీసులకు పట్టుబడ్డారు. చార్జిషీట్‌ దాఖలు చేసి వారిని నాంపల్లిలోని 3వ, 4వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.

290 మందికి జైలు శిక్ష, ఇద్దరి లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దు, ఒకరిది ఆరు నెలలపాటు రద్దు చేసింది. రూ. 2,25,81,400 చలానాల రూపంలో వసూలు చేశారు. జైలు శిక్ష పడిన వారితోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన వారిలో ముగ్గురికి రెండు రోజులు, ఒకరికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు.తాగేదేదో ఇంటివద్ద తాగాలని పిల్లలు తిట్టినా మందు బాబులు మారడం లేదు.

Related posts

రాజంపేటలో వికేంద్రీకరణకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ

Satyam NEWS

మాజీ ఎంపీ నారాయణ రెడ్డి సంతాప సభకు హాజరైన మంత్రి

Satyam NEWS

గుజరాత్ ఎన్నికల్లో రాని కరోనా.. ఎపిలో ఎలా వస్తుందో?

Satyam NEWS

Leave a Comment