28.7 C
Hyderabad
April 25, 2024 05: 49 AM
Slider కృష్ణ

తుఫానుపై సిఎస్ డా.జవహర్ రెడ్డి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్

#CS Dr. Jawahar Reddy

మాండౌస్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు.తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం ఆదివారం రెండు రోజులు గ్రామాల్లో పర్యటించాలని సిఎస్ ఆదేశించారు.వర్షపు నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని సిఎస్ డా.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తిరుపతి పట్టణంలో వర్షపు నీరు త్వరిత గతిన దిగువకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్ ను ఆయన ఆదేశించారు.

ఈటెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సియంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.పూనం మాలకొండయ్య మాట్లాడుతూ భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.వర్షపు నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనాలు చేపట్టాలని చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ తుపాను పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో నిరంతరం మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు తగు ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సంచాలకులు డా.బిఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ శుక్రవారం రాత్రి 8.30 గం.ల నుండి శనివారం ఉ.8.30గం.ల వరకు అన్నమయ్య జిల్లాలో 23.3 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 30.5,ప్రకాశం జిల్లాలో 14.1, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 57.6, తిరుపతి జిల్లాలో 75.7, వైయస్సార్ కడప జిల్లాలో 14.5 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని సిఎస్ కు వివరించారు.కాగా గత 24 గంటల్లో పై తెలిపిన ఆరు జిల్లాల్లోని 109 ప్రాంతాల్లో 64.5 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు డా‌.ఆంబేద్కర్ చెప్పారు.

టెలీకాన్ఫరెన్స్ లో పొల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు జిల్లాలో 2 గేదెలు,2గొర్రెలు చనిపోగా రెండు తాటాకు ఇళ్ళు దెబ్బతిన్నాయని వివరించారు.అన్నమయ్య జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఒక గృహం దెబ్బతిన్నదని చెప్పారు. ఇంకా ఈటెలీ కాన్ఫరెన్స్ లో పలువురు జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

మహా పాదయాత్ర: ఉత్తరాంధ్ర ప్రజలకు వ్యతిరేకత ఉందా?

Satyam NEWS

దళితులపై దాడులకు తెగబడుతున్న ఎంఐఎం గుండాలు

Satyam NEWS

జగజ్జనని

Satyam NEWS

Leave a Comment