38.2 C
Hyderabad
April 25, 2024 11: 24 AM
Slider జాతీయం

టెలిఫోన్ ట్యాపింగ్ పై రఘురాముడి ఫిర్యాదు

#Raghuramakrishnam Raju MP

ఆంధ్రప్రదేశ్ రాజకీయలను మరోసారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చుట్టేస్తున్నాయి. నిన్న ఒక ప్రముఖ పత్రికలో, న్యాయమూర్తుల ఫోనులు ట్యాప్ అవుతున్నాయా ? అంటూ ఒక కధనం వచ్చి సంచలనం సృష్టించటం, దాని పై ప్రభుత్వం లీగల్ నోటీసులు ఇవ్వటం తెలిసిందే.

ఈ సందర్భంగా, అధికార పార్టీ ఎంపీనే, తన ఫోన్ ట్యాప్ అవుతుంది అంటూ, సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు మాత్రమే కాదు, ఏకంగా కేంద్రాని హోం శాఖకు లేఖ రాసారు. ఫోన్ ట్యాపింగ్ నిజం అని తేలితే, ప్రభుత్వాలే కూలిపోతాయి అనటంలో సందేహం లేదు. గతంలో జరిగాయి కూడా.

ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎంపీ లేఖ రాసారు. హోం శాఖ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లాకు, రఘురామరాజు లేఖ రాస్తూ, గత కొన్ని నెలలుగా తన ఫోన్ లో రకరకాల శబ్దాలు వినపడుతున్నాయని, నాకు తెలిసిన సమాచారం ప్రకారం, మా రాష్ట్ర ఇంటలిజెన్స్ తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్టు తెలిసిందని, ఇది రాజ్యంగ ఉల్లంఘన అని, ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం, నేరం అని, ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

Related posts

గడ్డిమందు పిచికారీతో పచ్చదనం మటుమాయం

Satyam NEWS

జీవో నెంబర్ 1 ప్రజాస్వామ్యానికి “గొడ్డలి పెట్టు”: నవీన్

Satyam NEWS

#AdoptGirlChild: జగనన్నకు ప్రేమతో నీ ఆర్ కె రోజా

Satyam NEWS

Leave a Comment