37.2 C
Hyderabad
April 19, 2024 13: 49 PM
Slider ప్రపంచం

కెనడా నుంచి తొలి సారిగా అంతర్జాలంలో తెలుగు భాషా సాహితీ సదస్సు

#teluguconference

టోరంటో (కెనడా) ప్రధాన కేంద్రంగా తొలిసారిగా తెలుగు సాహితీ సదస్సును ఈ నెల 25, 26వ తేదీలలో ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. టొరాంటో (కెనడా) ప్రధాన కేంద్రంగా జరిగే ఈ రెండు రోజుల ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ వీక్షించే లా అంతర్జాలంలో జరుగుతుంది.  ప్రపంచంలో అతి పెద్ద దేశాలయిన కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి ఇంత పెద్ద ఎత్తున తమదే అయిన ఒక సాహిత్య వేదిక మీద కలుసుకోవడం చరిత్రలో ఇదే మొదటి సారి. మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు అయిన ఈ అంతర్జాల సదస్సుకు ఏర్పాట్లు త్వరితగతిని జరుగుతున్నాయి. సుమారు 100 మంది అమెరికా-కెనడా సాహితీవేత్తలు ఎంతో ఉత్సాహంగా స్పందించి తమ ప్రసంగ ప్రతిపాదనలని తమకు పంపించడం ఎంతో సంతోషాన్ని కలుగజేస్తోందని నిర్వాహకులు తెలిపారు. అందరికీ అవకాశం కలిగించడానికి సదస్సు జరిగే సమయాలని రెండు రోజులూ ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల దాకా (EST, Toronto Time) పొడిగించారు. అంటే మొత్తం 20 గంటలకి పైగా టొరాంటో (కెనడా) ప్రధాన కేంద్రంగా జరిగే ఈ రెండు రోజుల ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ వీక్షించే లా అంతర్జాలంలో జరుగుతుంది.

రెండు రోజుల సదస్సు ప్రత్యక్ష ప్రసారం చూసే లింక్ లు:

September 25, 2021 YouTube: https://bit.ly/3zcq0O1

September 26, 2021 YouTube: https://bit.ly/3mjgLYS

త్రివిక్రమ్ సింగరాజు రచన, శశి వర్ధన్ పట్లోళ్ళ దర్శకత్వం లో కెనడా యువతులు హర్ష దీపిక రాయవరపు, భావన పగిడేల ఈ సదస్సు గురించి అందించిన వివరాలు ఈ క్రింది వీడియో లింక్ లో చూడండి.

కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు సంచాలకులు : లక్ష్మీ రాయవరపు (టొరంటో, కెనడా): sadassulu@gmail.com

వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సస్, USA): vangurifoundation@gmail.com

సంధాన కర్తలు: విక్రమ్ సింగరాజు (కెనడా): triv.sing@gmail.com

శాయి రాచకొండ (USA): sairacha@gmail.com

కార్యనిర్వాహక సంఘం సభ్యులు: యామిని పాపుదేశి, భావన పగిడేల, సర్దార్ ఖాన్, కృష్ణ కుంకాల

నిర్వహిస్తున్న సంస్థలు: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక, ఆటవా తెలుగు అసోసియేషన్, అంటారియో తెలుగు ఫౌండేషన్, టొరాంటో తెలుగు టైమ్స్, కాల్గరి తెలంగాణా అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టోరాంటో, తెలుగు వాహిని సాహిత్య సమూహం.

Related posts

కరోనా మాస్క్ లపై ప్రకాశం జిల్లా ఎస్ పి అవగాహనాకార్యక్రమం

Satyam NEWS

మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించాలి

Satyam NEWS

పుల్వామా అమరవీరులకు ములుగులో ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment