28.7 C
Hyderabad
April 17, 2024 04: 14 AM
Slider నెల్లూరు

నెల్లూరు టీడీపీ నేతల 12 గంటల నిరాహార దీక్ష

Beeda Ravichandra

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న  పేదలను, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా టిడిపి ప్రధాన కార్యాలయమైన N.T.R. భవన్ లో తలపెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుల 12 గంటల నిరాహార దీక్ష ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

ముందుగా NTR గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన తర్వాత నిరాహార దీక్ష వేదిక పైన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి దీక్ష ప్రారంభించారు. నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది.

దీక్షకు సంఘీభావంగా టిడిపి అనుబంధ సంఘాల జిల్లా  అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు (TNSF) , P.L. రావు ( బీసీ సెల్) , సురేంద్ర బాబు ( క్రిస్టియన్ సెల్) , రంగారావు (ఎస్టీ సెల్) , దోర్నాల హరిబాబు (సాంస్కృతిక విభాగం)  తమ స్వగృహాల లో నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతీ పేద కుటుంబానికి రూ. 5,000/- ఆర్థిక సాయం అందించాలని తెలుగుదేశం నాయకులు నిరాహార దీక్ష సందర్భంగా డిమాండ్ చేశారు.

మూసేసిన అన్న క్యాంటీన్ల ను వెంటనే తెరవాలని, ధాన్యం, పత్తి, మిర్చి, పండ్ల తోటల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలని వారు డిమాండ్ చేశారు. సెరీకల్చర్, ఆక్వా, పౌల్ట్రీ రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని వారు కోరారు. కరోనా పై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులకు రక్షణ కిట్ లను అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related posts

అర్నబ్ గోస్వామి అరెస్టుకు లింకు లేదు

Sub Editor

సీఆర్ఫీఎఫ్ అమరులకు రూ.35 లక్షల ఎక్స్ గ్రేషియా

Sub Editor

ఏపీ నూతన సీఎస్ గా ఆదిత్యానాథ్ దాస్

Satyam NEWS

Leave a Comment