35.2 C
Hyderabad
April 24, 2024 12: 10 PM
Slider హైదరాబాద్

తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా కరణం అంబికా కృష్ణ

#KaranamBalaram

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత కరణం అంబికా కృష్ణను తెలంగాణ తెలుగు దేశం పార్టీ కార్యదర్శిగా నియమించారు.

గతం లో కరణం అంబికా కృష్ణ భారతీయ జనతా పార్టీ యువమోర్చ కార్యదర్శిగా పని చేసారు.

గత నాలుగు సంవత్సరాలుగా కరణం అంబికా కృష్ణ పావర్టీ ఏరాడికేషన్ డెవలప్మెంట్ సోసైటీ అనే స్వచ్చంద సంస్థను నిర్వహిస్తున్నారు.

కరణం అంబికా కృష్ణ తండ్రి కరణం బలరామకృష్ణ మూర్తి మాజీ ఎంపీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని చీరాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులుగా ఉన్నారు.

తల్లి  కాట్రగడ్డ ప్రసూనా సనత్ నగర్ టీడీపీ మాజీ MLA కాగా ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షరాలుగా పని చేస్తున్నారు.

తనకు పదవి ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడికి, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖరరెడ్డికి కరణం అంబికా కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవడానికి తన శాయశక్తులా పని చేస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

Related posts

మసీదుల్లో వారికి మాత్రమే అనుమతి.. సౌదీ ఆదేశాలు జారీ

Sub Editor

కొత్త సంవత్సరం రోజున పుట్టినవారు ఎందరో తెలుసా?

Satyam NEWS

కొత్త సంవత్సరానికి బోకేలు..మొక్కలు తేవొద్దు…!

Satyam NEWS

Leave a Comment