35.2 C
Hyderabad
April 24, 2024 11: 56 AM
Slider గుంటూరు

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా త్వరలో పాదయాత్ర

#chadalawada

ప్రజా సమస్యలే అజెండాగా నరసరావుపేట నియోజకవర్గంలో అతి త్వరలోనే తన పాదయాత్ర  ప్రారంభమవుతుందని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో డా౹౹చదలవాడ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు,దౌర్జన్యాలకు అతి త్వరలోనే చరమగీతం పాడుతామని పేర్కొన్నారు.

మూడేళ్ల ఏళ్ల వైసిపి పరిపాలన హయాంలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటాయన్నారు. చివరకు చెత్తను కూడా వదలకుండా పన్ను వేసిన ప్రభుత్వంగా వైసిపి అపవాదును మూటగట్టుకుందని విమర్శించారు. ఒక లక్ష్యం ప్రకారం రాజకీయాల్లోకి వచ్చానని రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసానని డా౹౹చదలవాడ పేర్కొన్నారు.

నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై పోరాటం చేస్తూ ప్రజలతో మమేకం కావాలన్నారు. ఎప్పుడైతే ప్రజల్లో ఉంటామో ఆరోజే మన విజయానికి నాంది అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అనేక మోసపూరిత వాగ్దానాలతో గెలుపొందిన ఎమ్మెల్యేలు నేడు ప్రజా సమస్యలను మరిచిపోయి మొహం చాటేస్తున్నారని విమర్శించారు.

గెలవక ముందు ఒక మాట గెలిచిన తర్వాత మరో మాట వైసీపీకి మొదటి నుంచి అలవాటేనన్నారు. నియోజకవర్గంలో పాదయాత్ర కు సంబంధించి తొందర్లోనే ప్రణాళిక రూపొందిస్తామన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పునాదులతో సహా పెకలించే  సమయం దగ్గరపడిందన్నారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కి అండగా ఉంటానని డాక్టర్ అరవింద్ బాబు చెప్పారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రతి పసుపు సైనికుడు సిద్ధంగా ఉండాలి… ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ రోజు రాష్ట్రంలో నిత్యావసరాలు, కరెంట్,పెట్రోల్,డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త శక్తివంచన లేకుండా పార్టీ గెలుపుకు కృషి చేసి మళ్ళీ 2024 లో మన అధి నాయకులు నారా చంద్రబాబునాయుడు ని ముఖ్యమంత్రిగా చేసే వరకు కలిసికట్టుగా కష్టపడదాం అన్నారు.  

సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు,రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షుడు వెన్న బలకోటి రెడ్డి,నరసరావుపేట మండల పార్టీ అధ్యక్షుడు బండరుపల్లి విశేశ్వరావు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్,రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు,తెలుగు యువత నాయకులు పోనుగోటి శ్రీను, కుమ్మేత కోటి రెడ్డి,మెడబలిమి నవీన్,షేక్ నాగూర్,రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు పూదోట సునీల్,మహిళా నాయకులు దాసరి ఉదయ్ శ్రీ,నాగ జ్యోతి,వందనా దేవి,మనుకొండ జాహ్నవి,పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్,మైనార్టీ నాయకులు మన్నన్ షరీఫ్,పఠాన్ సలీం,మబు,బడే బాబు,మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంగులూరి ఆంజనేయులు చౌదరి,వనమ శివ,కాండ్రతి సాంబయ్య, అత్తులూరి సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

కేరళలో భారీ పేలుడు: ఒకరు మృతి.. పలువురికి గాయాలు

Satyam NEWS

మడికి బ్రాందీ షాపులో రూ.2 లక్షలు నగదు చోరీ

Bhavani

ఎన్నిక‌ల ఖ‌ర్చుపై పునఃప‌రిశీల‌న‌లో సీఈసీ

Sub Editor

Leave a Comment